Ponguleti Srinivas Reddy: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పేదలకు ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద త్వరలో ఇండ్ల మంజూరు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు గ్రేటర్ పరిధిలో అపార్ట్‌మెంట్ తరహాలో ఇండ్లను అందించే తీపి కబురు త్వరలో చెబుతామని ఆయన హామీ ఇచ్చారు. జీహెచ్ఎంసీ పరిధిలోని కంటోన్మెంట్ నియోజకవర్గంలోగల రసూల్ పురలో 344 డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీలు ఈటల రాజేందర్, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే గణేశ్ తదితరులతో కలిసి మంత్రి పొంగులేటి ప్రారంభించారు.
Also Read: Mirai Movie: మరో ఆఫర్ ప్రకటించిన ‘మిరాయ్’ నిర్మాత.. పండగ కానుక అదిరింది!
పార్ట్‌మెంట్ తరహాలో ఇంండ్లను నిర్మిస్తాం
ఈసందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. పట్టణ ప్రాంతాల్లో 30 నుచి 70 గజాలున్నాసరే స్ధానికంగా నివసించే వారికి అపార్ట్‌మెంట్ తరహాలో ఇంండ్లను నిర్మిస్తామని స్పష్టంచేశారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ రూపొందిస్తున్నామని వెల్లడించారు. గతంలో కంటోన్మెంట్ ఉప ఎన్నికల సమయంలో తాను ఈ ప్రాంతంలో మొండి గోడలతో ఉన్న ఇండ్లను పూర్తిచేసి ఇస్తానని మాట ఇచ్చానని, ఇప్పుడు దాన్ని నెరవేర్చామని తెలిపారు. నాటి ప్రభుత్వంలో దొర.. పేదలకు ఇండ్లు కడితే కమీషన్లు రావని కాళేశ్వరం ప్రాజెక్ట్‌పైనే దృష్టి సారించారని విమర్శించారు. ఆనాడు ఏడాదికి లక్ష ఇండ్లు కట్టినా పదేండ్లలో 10 లక్సల ఇండ్లు పేదలకు వచ్చేవని అన్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో ఇండ్ల నిర్మాణానికి ప్రత్యేక దృష్టి
పేదల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా సాగుతున్న ఈ ప్రజా ప్రభుత్వం ఎన్ని ఆర్ధిక ఇబ్బందులున్నా తొలివిడుతగా 4.50 లక్షల ఇండ్ల నిర్మాణానికి సంకల్పించిందన్నారు. మరో మూడు విడుతల్లో కూడా మంజూరు చేస్తామని, దీనిలో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఇండ్ల నిర్మాణానికి ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. స్థానిక ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే గణేష్ ప్రస్థావించిన అంశాలమేరకు వాజ్‌పేయి కాలనీలో మొండిగోడలతో ఉండిపోయిన ఇండ్లను పూర్తిచేసి లబ్ధిదారులకు అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అదేవిధంగా అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లకు మరమ్మతులు చేసి నెల రోజుల్లోగా పేదలకు కానుకగా అందిస్తామని హామీ ఇచ్చారు.
సౌకర్యాలతో కూడిన శ్మశానవాటిక
కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని పేదలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా తాతముత్తాతల నుంచి నివసిస్తున్నవారి భూములను ఫ్రీహోల్డ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తరపున తగు సాయాన్ని అందిస్తామని వివరించారు. దీనికోసం ఎంపీ రాజేందర్ కేంద్ర ప్రభుత్వం నుంచి తగు ఆదేశాలు తేవాలని మంత్రి పొంగులేటి సూచించారు. కంటోన్మెంట్ ప్రాంతంలో సౌకర్యాలతో కూడిన శ్మశానవాటికను నిర్మిస్తామని, ఈ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు సాధించాలని ఎంపీ ఈటలకు సూచించారు. కంటోన్మెంట్ నియోజకవర్గానికి గతంలో ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామని పొంగులేటి హామీ ఇచ్చారు. పేదల ఇండ్ల గృహప్రవేశాల్లో పాల్గొంటున్నందుకు తన జన్మధన్యమైందని మంత్రి వివరించారు. అనంతరం పేదలకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు.
Also Read: Petal Gahlot: ఐరాసలో పాక్ ప్రధాని వ్యాఖ్యలకు దిమ్మతిరిగే కౌంటర్లు ఇచ్చిన భారత లేడీ ఆఫీసర్