Mirai Movie
ఎంటర్‌టైన్మెంట్

Mirai Movie: మరో ఆఫర్ ప్రకటించిన ‘మిరాయ్’ నిర్మాత.. పండగ కానుక అదిరింది!

Mirai Movie: సూపర్ హీరో తేజ సజ్జా (Teja Sajja) నటించిన ‘మిరాయ్’ (Mirai Movie) చిత్రం విడుదలైనప్పటి నుంచి పాజిటివ్ టాక్‌తో, కలెక్షన్ల పరంగా రికార్డులు క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో వచ్చిన ఈ ఫాంటసీ మూవీలో రితికా నాయక్ హీరోయిన్‌గా నటించగా, ఫస్ట్ టైమ్ మంచు మనోజ్ (Manchu Manoj) విలన్‌గా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. సెప్టెంబర్ 12న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బ్రహ్మండ్ బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని అందుకుంది. ఇంకా ఈ చిత్రం థియేటర్లలో కొన్ని చోట్ల సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శించబడుతోంది. ప్రస్తుతం థియేటర్లలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ (Pawan Kalyan OG) సంచలనాలను క్రియేట్ చేస్తున్న నేపథ్యంలో ప్రేక్షకులను ఆకర్షించేందుకు ‘మిరాయ్’ నిర్మాతలు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే..

Also Read- Mohan Babu: కింగ్ నాగార్జున రూటులోనే కలెక్షన్ కింగ్.. మరో పిక్ వచ్చింది చూశారా?

సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ల ధరలు తగ్గింపు

ఆల్రెడీ ఈ శనివారం (సెప్టెంబర్ 27) నుంచి ‘మిరాయ్’ సినిమాలో ‘వైబ్ ఉంది’ అనే సాంగ్‌ని యాడ్ చేస్తున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు ప్రేక్షకులను ఆకర్షించేందుకు, అలాగే దసరా పండుగ కానుకగా అంటూ చిత్ర బృందం ఈ సినిమా టికెట్ల ధరలను తగ్గిస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు మేకర్స్ చెబుతున్న ప్రకారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఈ సినిమా టికెట్ ధరలను తగ్గిస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఇకపై ఈ సినిమా టికెట్ ధరలు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో బాల్కనీ ధర రూ. 150, ఫస్ట్ క్లాస్ రూ. 105గా ఉంటాయని మేకర్స్ స్పష్టం చేశారు. ‘‘ఈ దసరా పండుగను మీ ఫ్యామిలీ అంతా కలిసి ‘మిరాయ్’ థియేటర్లలో సెలబ్రేట్ చేసుకోండి. సింగిల్ స్క్రీన్‌లో అతి తక్కువ ధరకు ఈ సినిమాను ఆస్వాదించండి’’ అని మేకర్స్ తెలియజేశారు. ఈ నిర్ణయంలో మరోసారి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వార్తలలో నిలుస్తుంది.

Also Read- R Narayana Murthy: చిరంజీవి చెప్పిందంతా నిజమే.. బాలయ్య కాంట్రవర్సీపై పీపుల్ స్టార్ స్పందనిదే!

‘ఓజీ’ కోసం త్యాగం

ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సినిమా విడుదలను పురస్కరించుకుని ‘మిరాయ్’ థియేటర్లను కూడా ఆ సినిమాకు కేటాయించాలని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఇలా సంచలన నిర్ణయం తీసుకుని, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే ప్రయత్నంగా ఇలా టికెట్ల ధరలను తగ్గించాలనే నిర్ణయాన్ని ప్రేక్షకులు కూడా స్వాగతిస్తున్నారు. ఈ ధరలతో సినిమా అభిమానులు కచ్చితంగా థియేటర్లకు వస్తారని సినీ వర్గాలు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం విశేషం. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు ఈ సినిమా రూ. 140 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి.. బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు తీసుకున్న నిర్ణయంతో కలెక్షన్లు ఇంకా పెరుగుతాయని నిర్మాతలు ఆశిస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Anasuya Bharadwaj: మరోసారి సోషల్ మీడియాలో మంటలు రేపిన రంగమ్మత్త.. ఫొటోలు వైరల్!

K-Ramp: ‘కె-ర్యాంప్’ అంటే బూతు మాట కాదు.. ఏంటంటే..?

Nikhil Siddhartha: నేను 2008లోనే చెప్పా.. ‘ఓజీ’ సినిమాపై నిఖిల్ ఆసక్తికర పోస్ట్!

Medak Heavy Rains: ఆ జిల్లాల్లో దంచికొట్టిన వర్షం.. జలదిగ్బంధంలో ఏడుపాయల దుర్గమ్మ ఆలయం

Cyber Crime: డిజిటల్ అరెస్ట్ పేరిట బెదిరింపు.. గుండెపోటుతో బాధితురాలి మృతి