Mohan Babu in The Paradise
ఎంటర్‌టైన్మెంట్

Mohan Babu: కింగ్ నాగార్జున రూటులోనే కలెక్షన్ కింగ్.. మరో పిక్ వచ్చింది చూశారా?

Mohan Babu: ఒకప్పుడు విలన్‌గా నటించి, హీరోగా మారిన నటులలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు (Collection King Mohan Babu) కూడా ఒకరు. ఆయన విలనిజం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇంకా చెప్పాలంటే, హీరోగా కంటే కూడా విలన్‌గానే ఆయనకు సక్సెస్ రేట్, స్టార్‌డమ్ అధికం అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం కూడా లేదు. అంటే హీరోగా స్టార్‌డమ్ లేదని కాదు, హీరోగా కూడా ఆయన అత్యద్భుతమైన సినిమాలు చేశారు. కానీ, కొంతకాలంగా ఆయన హీరోగా చేస్తున్న ప్రయత్నాలేవీ వర్కవుట్ కావడం లేదు. అందుకే రూటు మార్చాలని డిసైడ్ అయ్యారు. తన కుమారుడు విష్ణు హీరోగా చేసిన ‘కన్నప్ప’ (Kannappa) చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించిన మోహన్ బాబు.. ఇప్పుడు మరోసారి విలన్‌గా సెకండ్ ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేస్తున్నారు. ఇటీవల కింగ్ నాగార్జున (King Nagarjuna) కూడా విలన్‌గా కనిపించి, అందరి మన్ననలను అందుకున్న విషయం తెలిసిందే.

Also Read- Jr NTR: ‘కాంతార చాప్టర్ 1’ వేదికపై ‘డ్రాగన్’ అప్డేట్ ఇవ్వబోతున్నారా? ఫ్యాన్స్ వెయిటింగ్!

కింగ్ నాగార్జున బాటలో..

ఇప్పుడాయన రూటులోనే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా నడవబోతున్నారు. ఆయన రూటులోనే కాదు, ‘కూలీ’ సినిమాలో కింగ్ నాగార్జున కనిపించిన అవతార్‌లోనే మోహన్ బాబు కూడా కనిపిస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి. మోహన్ బాబు విలన్‌గా చేస్తున్న చిత్ర వివరాల్లోకి వెళితే.. నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) జడల్‌గా నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ (The Paradise) చిత్రంపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో తెలియంది కాదు. ఇప్పుడా సినిమాపై ఉన్న అంచనాలను డబుల్ చేసేలా మేకర్స్ అదిరిపోయే అనౌన్స్‌మెంట్ చేశారు. అవును, ‘ది ప్యారడైజ్’ చిత్రంలో విలన్‌గా మోహన్ బాబు నటించబోతున్నారు. ఈ విషయం చెబుతూ, మోహన్ బాబుకు సంబంధించిన రెండు పవర్ ఫుల్ పోస్టర్స్‌ని మేకర్స్ విడుదల చేశారు. ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో మోహన్ బాబు పాత్ర, ఆ పాత్ర పేరు, ఆయన లుక్.. సినిమాపై బీభత్సమైన హైప్‌కి కారణమవుతున్నాయి.

Also Read- R Narayana Murthy: చిరంజీవి చెప్పిందంతా నిజమే.. బాలయ్య కాంట్రవర్సీపై పీపుల్ స్టార్ స్పందనిదే!

‘శికంజ మాలిక్’‌గా మోహన్ బాబు

ఇందులో ‘శికంజ మాలిక్’ (Shikanja Maalik)గా మోహన్ బాబు కనిపించనున్నారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చాలా కాలం తర్వాత మోహన్ బాబును బిగ్ స్క్రీన్ పైకి విలన్‌గా తీసుకువస్తున్నారు. ‘ది ప్యారడైజ్’లో పవర్ ఫుల్ విలన్‌గా మోహన్ బాబుని ఆయన చూపిస్తున్నారు. ఈ పాత్ర గురించి శ్రీకాంత్ ఓదెల చెప్పిన వెంటనే మోహన్‌బాబు అంగీకరించడంతో పాటు, తన కోసం ఇలాంటి ఓ పవర్‌ఫుల్ పాత్రను రాసిన దర్శకుడు శ్రీకాంత్ అభిమానిగా ఆయన మారిపోయారంటే.. ‘శికంజ మాలిక్’ పాత్ర ఏ రేంజ్‌లో ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. ఆ విషయం తాజాగా విడుదల చేసిన రెండు పవర్ లుక్స్ చెప్పకనే చెప్పేస్తున్నాయి. షర్ట్‌ లేకుండా గన్‌, కత్తి పట్టుకుని సిగార్‌ కాలుస్తూ రగ్గడ్‌ అండ్ ఇంటెన్స్ లుక్ ఒకటైతే.. మరో లుక్‌లో రెట్రో అవతార్‌లో సిగార్ కాలుస్తూ.. భుజంమీద గన్ పెట్టుకొని నడుచుకుంటూ వస్తున్నట్లు ప్రజంట్ చేశారు. ఈ రెండు లుక్స్ మైండ్ బ్లోయింగ్ అన్నట్లుగా ఉన్నాయి. ఈ రెండు లుక్స్ కూడా అద్భుతమైన రెస్పాన్స్‌తో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎస్‌ఎల్‌వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా 2026 మార్చి 26న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాళీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో విడుదల కానుంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Telusukada OTT: ఓటీటీలోకి వచ్చేసిన సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసుకదా’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Currency Scam: ఓరి నాయనా.. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు పెట్టి దందా.. ఎంచేశారంటే..?

Jogulamba Gadwal: జోరుగా అక్రమ ఇసుక రవాణా.. అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు

Crime News: నకిలీ పత్రాలతో 52 డొల్ల కంపెనీల ఏర్పాటు.. ఇద్దరు అరెస్ట్.. పరారీలో మాస్టర్‌ మైండ్..!

Jio Hotstar: 1 బిలియన్ డౌన్‌లోడ్స్ క్లబ్‌లో జియోహాట్‌స్టార్.. సూపర్ స్టార్ మహేష్ బాబు ఎఫెక్ట్?