Stray Dogs Row (Image Source: Twitter)
Viral

Stray Dogs Row: సుప్రీంకోర్టు బయట కుక్కల పంచాయితీ.. డాగ్ లవర్ చెంప చెల్లుమనిపించిన లాయర్!

Stray Dogs Row: వీధి కుక్కల తరలింపు విషయంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) ఇచ్చిన తీర్పును డాగ్ లవర్స్ (Dog Lovers) తప్పుబడుతున్నారు. ఇందుకు నిరసనగా సుప్రీంకోర్టు వెలుపల తమ నిరసన తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ఓ డాగ్ లవర్ పై లాయర్ దాడి చేయడం అందరనీ షాక్ కు గురిచేసింది. ఓ వ్యక్తి చెంప చెల్లుమనిస్తున్న వీడియో వైరల్ అవుతోంది.

వీడియోలో ఏముందంటే?
వైరల్ అవుతున్న వీడియోను గమనిస్తే.. సుప్రీంకోర్టు గేటు బయట కొందరు జంతు ప్రేమికులు ఉన్నారు. వారిలోని ఓ వ్యక్తిపై లాయర్ కోపంతో దాడి చేశారు. లాయర్ ఆగ్రహంతో రెండుసార్లు ఆ వ్యక్తిని కొట్టగా.. అక్కడున్న వారు వెంటనే జోక్యం చేసుకొని వారిని విడదీశారు. సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన రోజు (ఆగస్టు 11)న ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే లాయర్ వ్యవహరించిన తీరును నెటిజన్లు తప్పుబడుతున్నారు. దేశ సర్వోన్నత న్యాయస్థానం ముందే ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం బాధాకరమని పేర్కొంటున్నారు.

Also Read: YS Jagan: వైఎస్ జగన్ సంచలన ప్రెస్ మీట్.. కూటమి సర్కార్‌‌పై తీవ్ర స్థాయిలో ఫైర్!

సుప్రీం కోర్టు ఏమన్నదంటే?
వీధి కుక్కలను నివాస ప్రాంతాల నుండి దూరంగా తరలించాల్సిందేనని దేశ సర్వోన్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ చర్యను అడ్డుకునే ఏ సంస్థ అయిన కఠిన చర్యలను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించింది. ఢిల్లీలో వీధి కుక్కల దాడులు, రేబీస్‌ వల్ల మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ముఖ్యమైన ఆదేశాన్ని సుప్రీం కోర్టు జారీ చేసింది. ‘ఇది మన కోసం కాదు.. ప్రజా ప్రయోజనం కోసం. కాబట్టి ఎటువంటి భావోద్వేగాలు కలగరాదు. వెంటనే చర్యలు తీసుకోవాలి’ అని ధర్మాసనం సూచించింది. దేశ రాజధాని, నోయిడా, ఘాజియాబాద్, గురుగ్రామ్‌ పరిధి కలిగిన ఢిల్లీ ఎన్‌సీఆర్ (Delhi-NCR) ప్రాంతంలోని పౌర సంస్థలు తక్షణమే కుక్కల కోసం షెల్టర్లు నిర్మించి వీధి కుక్కలను తరలించి ఎనిమిది రోజుల్లో కోర్టుకు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

Also Read: UP Crime: రాఖీ కట్టిన మైనర్ బాలికపై హత్యాచారం.. వీడు అసలు మనిషేనా?

ఆదేశాలపై పునః సమీక్ష
అయితే సుప్రీంకోర్టు ఆదేశాలను డాగ్ లవర్స్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జంతు హక్కుల కార్యకర్త మాజీ కేంద్ర మంత్రి మేనకా గాంధీ (Maneka Gandhi) సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తప్పుబట్టారు. ‘ఇది అసాధ్యమైంది.. ఆర్థికంగా భారం కూడా. ఢిల్లీలో మూడు లక్షల కుక్కలు ఉన్నాయి. వాటినంతా వీధుల నుంచి తీసేవేసి షెల్టర్లు ఏర్పాటు చేయాలంటే దాదాపు రూ.15,000 కోట్ల ఖర్చు అవుతుంది. ఢిల్లీకి అంత డబ్బు ఉందా?’ అని ఆమె ప్రశ్నించారు. అయితే సమాజం నుంచి వస్తోన్న వ్యతిరేకత నేపథ్యంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బి.ఆర్. గవాయ్ (B. R. Gavai) బుధవారం స్పందించారు. వీధి కుక్కలపై విధించిన నిషేధాన్ని మళ్లీ పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.

Also Read This: Rajasthan Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది స్పాట్ డెడ్.. మృతుల్లో ఏడుగురు చిన్నారులు!

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది