YS Jagan (Image Source: Twitter)
ఆంధ్రప్రదేశ్

YS Jagan: వైఎస్ జగన్ సంచలన ప్రెస్ మీట్.. కూటమి సర్కార్‌‌పై తీవ్ర స్థాయిలో ఫైర్!

YS Jagan: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మంగళవారం జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ గురించి ప్రస్తావిస్తూ.. కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పోలింగ్ ఏజెంట్లు లేకుండా జరిగేదానిని ఎన్నికలు అంటారా? అని జగన్ ప్రశ్నించారు. తమ ఏజెంట్ల నుంచి ఫాం 12 ను లాక్కున్నారన్న జగన్.. కనీసం పోలింగ్ బూతుల్లో వారిని కూర్చోనీయలేదని ఆరోపించారు. 15 బూత్ ల్లో వైసీపీ ఏజెంట్లు లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీలో శాంతిభద్రతలు లేవు
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. నిన్న జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా జరిగిన దాడులో ఇందుకు నిదర్శమని అన్నారు. పోలింగ్ ఏజెంట్లు లేకుండా ఇంత అన్యాయంగా ఏనాడు ఎన్నికలు జరగలేదని జగన్ ఆరోపించారు. ‘ప్రజాస్వామ్యం ఇంత దిగజారిన పరిస్థితులు బహుశా ఏనాడూ చూసి ఉండరు’ అంటూ వ్యాఖ్యానించారు. బందిపోటు దొంగల తరహాలో చంద్రబాబు ఎన్నిక జరిపించారని మండిపడ్డారు. చంబల్‌ లోయ బందిపోట్లను మరిపించేలా ఎల్లో బ్యాచ్‌ ఓట్ల రిగ్గింగ్‌కు పాల్పడిందని ఆరోపించారు. సీఎం చంద్రబాబు (CM Chandrababu)కి తన పాలనపై నమ్మకం ఉంటే ప్రజాస్వామ్య బద్దంగా కేంద్ర బలగాలతో ఎన్నిక జరిపించాలని పట్టుబట్టారు.

Also Read: Jangaon Strange Incident: రాష్ట్రంలో అద్భుతం.. వింతగా ప్రవర్తించిన చెట్టు.. ఇది దేవుడి మహిమేనా?

పోలింగ్‌ బూత్‌లను మార్చేశారు
ప్రజాస్వామ్యం సిగ్గుపడేలా మంగళవారం జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరిగిందని జగన్ అన్నారు. పోలింగ్ బూత్ ఆవరణలో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీలు ఇచ్చే ధైర్యముందా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రతిబూత్ లో వెబ్ కాస్టింగ్ ఇచ్చే దమ్ముందా? అసలు పులివెందులలో జరిగింది ఎన్నికే అంటారా? ఆఖరికి పోలింగ్ బూత్ లను కూడా మార్చేశారు’ అంటూ జగన్ దుయ్యబట్టారు. ‘ఒక ఊరివాళ్లు.. మరో ఊరికి వెళ్లి మరీ ఓటేయాలట. సొంత గ్రామం కాకుండా ఇతర గ్రామాలకు వెళ్లి ఓటేయాలా? ప్రజాస్వామ్యం సిగ్గుపడేలా ఎన్నిక నిర్వహించారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.

Also Read This: Gujrat Crime: దేశంలో ఘోరం.. భార్యపై తండ్రి, తమ్ముడితో అత్యాచారం చేయించిన భర్త! 

‘పోలీసులే దొంగ ఓట్లు ప్రోత్సహించారు’
తన సొంత నియోజకరవర్గమైన పులివెందులలో ఒక్కో ఓటర్ కు ఒక్కో రౌడీని దింపారని జగన్ ఆరోపించారు. ప్రతీ పోలింగ్ బూత్ కు 400 మందిని మోహరించారని పేర్కొన్నారు. బీటెక్ రవి పులివెందుల రూరల్ ఓటర్ కానప్పటికీ.. కనంపల్లిలో తిష్ట వేసి దౌర్జన్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పచ్చ చొక్కా వేసుకున్న పోలీసులు 700 మంది.. బయటి నుంచి టీడీపీ నేతలు, వాళ్ల వర్గీయులు.. దాదాపుగా మొత్తం 7 వేలమంది పులివెందులలో మోహరించారు’ అని జగన్ అన్నారు. పోలీసులే దొంగ ఓట్లను ప్రోత్సహించారని విమర్శించారు. కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ సమక్షంలోనే టీడీపీ నేతలు దొంగ ఓట్లు వేశారని జగన్ ఆరోపించారు. అంతేకాదు క్యూ లైన్ లో నిలబడి దొంగ ఓట్లు వేసిన వాళ్ల ఫొటోలను చూపించడంతో పాటు వారి వివరాలను సైతం జగన్ చదివి వినిపించడం గమనార్హం.

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం