Gujrat Crime (Image Source: AI)
జాతీయం

Gujrat Crime: దేశంలో ఘోరం.. భార్యపై తండ్రి, తమ్ముడితో అత్యాచారం చేయించిన భర్త!

Gujrat Crime: భార్య భర్తల అనుబంధం నానాటికి బలహీన పడుతోంది. సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన దంపతులు.. ఒకరినొకరు వంచించుకుంటున్నారు. కొందరు ఒక అడుగు ముందుకేసి జీవిత భాగస్వామిని దారుణంగా హత్య చేస్తున్న దురాగతాలు ఇటీవల కాలంలో చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే దేశంలో మరో ఘోరం చోటుచేసుకుంది. ఓ మహిళపై ఆమె మామ, మరిది దారుణానికి ఒడిగట్టారు. అయితే భర్త ప్రమేయంతోనే ఇది జరిగినట్లు బాధితురాలు ఆరోపించడం సంచలనంగా మారింది.

వివరాల్లోకి వెళ్తే..
గుజరాత్ (Gujrat) వడోదరా (Vadodara)లోని నవాపుర పోలీసు స్టేషన్ (Navapura police station)లో ఈ ఘటనకు సంబంధించిన కేసు నమోదైంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమెకు తన భర్త (40)తో 2024 ఫిబ్రవరిలో వివాహమైంది. తన కంటే వయసులో పెద్దవాడ్ని పెళ్లి చేసుకోవడంతో ఆమెకు పిల్లలు పుట్టడం కష్టంగా మారింది. మరోవైపు సహజంగానే అత్త, మామలు బిడ్డల కోసం ఆమెను సూటిపోటి మాటలు అనడం ప్రారంభించారు.

స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటంతో..
బంధువుల మాటలు భరించలేక.. సమస్య ఏంటో తెలుసుకునేందుకు బాధితురాలు ఆమె భర్త ఆస్పత్రికి వెళ్లారు. ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్  (Fertility treatments) చేయించుకోవడం ప్రారంభించారు. అయితే వైద్య పరీక్షల్లో భర్తకు స్రెర్మ్ కౌంట్ చాలా తక్కువగా ఉందని వైద్యులు తెలిపారు. సహజసిద్ధమైన గర్భధారణ కష్టమని తేల్చారు. దీంతో ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ ( Vitro fertilisation – IVF) చికిత్సను సూచించారు. అయితే అదికూడా విఫలం కావడంతో ఇక పిల్లలు పుట్టరని భావించి.. బాధితురాలు బిడ్డను దత్తత తీసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే దీనికి అత్తమామలు అంగీకరించలేదు.

నిద్రిస్తుండగా మామ వచ్చి..
ఈ క్రమంలో 2024 జులైలో తాను నిద్రలో ఉండగా తన మామ గదిలోకి వచ్చి తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. తాను అరవడంతో తన చెంపపై కొట్టాడని పేర్కొంది. ఆ సమయంలో పక్కనే ఉన్న భర్త.. తన తండ్రి కోరిక నెరవేర్చేందుకు నిశ్శబ్దంగా ఉండాలని సూచించాడని చెప్పింది. లేకపోతే నగ్న ఫొటోలు బయటపెడతానని బెదిరించాడని వాపోయింది. మామ తనపై అనేకసార్లు అత్యాచారం చేసినా.. గర్భం రాలేదని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.

Also Read: Vijay Sethupathi: విజయ్ సేతుపతికి ఆ కోరిక తీరిస్తేనే అమ్మాయిలకు సినిమాలో ఛాన్స్ ఇస్తాడా.. నిజాలు బయటపెట్టిన డైరెక్టర్?

మరిది సైతం వదల్లేదు..
2024 డిసెంబర్‌లో తన మరిది కూడా గదిలోకి వచ్చి అత్యాచారం చేశాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. అతడు కూడా పలుమార్లు తనపై లైంగికదాడి చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. 2025 జూన్‌లో తనకు గర్భం వచ్చిందని.. ఆగస్టులో గర్భస్రావం జరిగిందని వివరించింది. జూలైలో పోలీసులను సంప్రదించి మొత్తం సంఘటన వివరించగా ప్రాథమిక దర్యాప్తు అనంతరం తాజాగా అధికారికంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

Also Read This: CM Revanth Reddy: మరో మూడు రోజులు భారీ వర్షాలు.. ముందస్తు జాగ్రత్తలపై సీఎం కీలక ఆదేశాలు 

Also Read This: Minister Seethaka: అత్యవసరం ఉంటే తప్ప ప్రజలు బయటకు రావద్దు.. మంత్రి సీతక్క విజ్ఞప్తి

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?