Minister Seethaka (iMAGE credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Minister Seethaka: అత్యవసరం ఉంటే తప్ప ప్రజలు బయటకు రావద్దు.. మంత్రి సీతక్క విజ్ఞప్తి

Minister Seethaka: రానున్న 72 గంటల పాటు భారీ వర్షాలు ఉన్నాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు అప్రమత్తగా ఉండాలని రాష్ట్ర, ములుగు జిల్లా(Mulugu District) ప్రజానీకానికి మంత్రి సీతక్క(Minister Seethakka) ఒక ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షా(Heavy rain)లు కురిసే అవకాశం ఉంది. అందువల్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. వాగులు, చెరువులు, నదుల దగ్గరికి వెళ్లకూడదు.

 Also Read: Mee Seva New Service: మీ సేవ పరిధిలోకి కొత్త సేవలు.. నిమిషాలలో ఈ సర్టిఫికెట్ జారీ

సురక్షితమైన ప్రదేశాలలో ఉండాలి

ముఖ్యంగా రాత్రి సమయంలో బయటికి రావద్దన్నారు. తడిసిన గోడల వద్ద, పాత ఇళ్లలో కాకుండా సురక్షితమైన ప్రదేశాలలో ఉండాలని సూచించారు. సీఎం నిత్యం వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లు, పోలీసు(Police) అధికారులు, ఇతర శాఖల అధికారులకు అవసరమైన సూచనలు ఇచ్చారు. అధికారులు వాటిని ఖచ్చితంగా అమలు చేసి, ప్రజలకు తెలియజేయాలన్నారు. ములుగు జిల్లా పరిసరాల్లో గోదావరి, వాగులు వంకలు పొంగిపొర్లే అవకాశం ఉంది. వాగులు దాటడం, దూరప్రాంతాలకు వెళ్లడం వాయిదా వేసుకోవాలన్నారు.

పోలీసులు ప్రజలను  అప్రమత్తం చేయాలి

ముఖ్యంగా చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు ఈ వర్షాల సమయంలో బయటికి వెళ్లకుండా కుటుంబ సభ్యులతోనే ఉండాలని కోరారు. కలెక్టర్లు, అధికారులు, పోలీసులు(Police) ప్రజలను నిరంతరం అప్రమత్తం చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ(Congress Party) నాయకులు కూడా అధికారులతో కలసి గ్రామం గ్రామంలో ప్రజలకు జాగ్రత్త చర్యల గురించి తెలియజేయాలి. ప్రతి ఒక్కరూ సురక్షితంగా, జాగ్రత్తగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వడం కానీ, ప్రభుత్వం ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు.

 Also Read: Auto Drivers Struggle: ఉచిత బస్సు ప్రయాణం.. మహాలక్ష్మితో ఆటో డ్రైవర్లు దివాలా 

Just In

01

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?