Vijay Sethupathi: ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, గత కొద్దీ రోజుల నుంచి వార్తల్లో నిలుస్తున్నాడు. బ్రిటన్‌కు చెందిన రమ్య మోహన్ (Ramya Mohan) అనే వ్యక్తి Xలో ఓ పోస్ట్‌లో విజయ్ సేతుపతిపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఆయన బయట కనిపించేంత మంచివాడు కాదని, తన స్నేహితురాలిని అవకాశాల పేరుతో ఉపయోగించుకున్నాడని, క్యారవాన్‌కు వస్తే రూ.2 లక్షలు, ఇతర సేవలకు రూ.50 వేలు రేటు నిర్ణయించాడని ఆమె ఆరోపించింది. ఈ పోస్ట్ వైరల్ కాగానే రమ్య దాన్ని డిలీట్ చేసి, తన స్నేహితురాలి గోప్యత కోసం తొలగించినట్లు ఆమె వెల్లడించింది.
Also Read: CM Revanth Reddy: మరో మూడు రోజులు భారీ వర్షాలు.. ముందస్తు జాగ్రత్తలపై సీఎం కీలక ఆదేశాలు
ఈ వివాదంపై విజయ్ సేతుపతి తన తాజా చిత్రం ‘తలైవన్ తలైవి’ ప్రమోషన్స్ లో స్పందిస్తూ, ఈ ఆరోపణలలో ఎలాంటి నిజం లేదని, నిరాధారమని, తన బృందం ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. “ నేను బాగా తెలిసిన వాళ్లు ఈ ఆరోపణలు చూసి నవ్వుతారు. నాకు నేను బాగా తెలుసు. ఇలాంటి ఆరోపణలు నన్ను కదిలించలేవు. కానీ, నా కుటుంబం, సన్నిహితులు చాలా బాధపడ్డారు. ఈ మహిళ కేవలం గుర్తింపు కోసం ఇలా చేస్తోంది. ఆమెను కొన్ని రోజులు ఆ ఫేమ్ ఆస్వాదించనివ్వండి, తర్వాత మర్చిపోండి,” అని ఆయన అన్నారు. తన కొత్త చిత్రం హిట్ అయితే చూడలేని వాళ్ళు ఈ ఆరోపణలు చేస్తున్నారని, సోషల్ మీడియాలో ఎవరైనా ఏదైనా అనవచ్చని, దీనికి ఎలాంటి ఫిల్టర్లు లేవని ఆయన వ్యాఖ్యానించారు.
అయితే, ఈ వివాదం ఇంకా చల్లారకముందే సీనియర్ దర్శకుడు గీత కృష్ణ (Geetha Krishna) విజయ్ సేతుపతిపై మరింత సంచలన ఆరోపణలు చేశారు. రమ్య మోహన్ చేసిన ఆరోపణల్లో నిజం ఉందని, విజయ్ సేతుపతి డబ్బు సంపాదన పెరిగిన తర్వాత అతని ప్రవర్తన పూర్తిగా మారిపోయిందని ఆయన విమర్శించారు. “15 ఏళ్ల వయసు తేడాతో ఉన్న హీరోయిన్‌ను పక్కన వద్దని అబద్ధాలు చెబుతూ, మరోవైపు అలాంటి పనులు చేస్తున్నాడు. క్యారవాన్‌లో హీరోయిన్‌తో వచ్చే మరో అమ్మాయికి రూ.2 లక్షలు రేటు నిర్ణయిస్తాడు. రూమ్‌కు వస్తే మరో రేటు ఇస్తాడు. కోరికలు తీర్చుకుని, తదుపరి సినిమాలో అవకాశం ఇస్తానని మాట ఇస్తాడు. ఒక్క సినిమాకి 20-40 కోట్లు తీసుకుంటూ, ఇలాంటి పనులకు దిగుతున్నాడు,” అని గీత కృష్ణ ఆరోపించారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
