Bhatti Vikramarka: గ్రీన్ పవర్ ఉత్పత్తికి భారీ ప్రణాళికలు చేసుకున్నామని, పన్ను భారం మోపకుండా ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో సబ్ స్టేషన్లకు శంకుస్థాపన, రేషన్ కార్డులు, రైతులకు ట్రాన్స్ ఫార్మర్ల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. చేవెళ్ల నియోజకవర్గానికి మొత్తం 5 సబ్ స్టేషన్లు మంజూరుచేయగా, ఇందులో ఒకేసారి రూ.20 కోట్లకుపైగా నిధులతో నిర్మించిన మూడు 33/11 కేవీ సబ్ స్టేషన్లకు భట్టి శంకుస్థాపన చేశారు.
మరో రెండు షబ్ స్టేషన్ల పనులు కొనసాగుతున్నాయి. కాగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ.. భవిష్యత్ తరాలకు మేలు చేసేలా విద్యుత్ ఉత్పాదనకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. 2047 నాటికి పెరిగే డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ విద్యుత్ ఉత్పత్తికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అందుకు సంబంధించిన సమాచారన్ని పంపాలని ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసినట్లు భట్టి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలు, రెసిడెన్షియల్ స్కూల్స్, కస్తూర్బా గాంధీ పాఠశాలల్లో వందకు వంద శాతం సౌర విద్యుత్ ఉత్పత్తి కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు.
Also Read: Anupama parameswaran: ఆ హీరోతో ముద్దు సీన్స్ బలవంతంగా చేయాల్సి వచ్చింది.. అనుపమ సంచలన కామెంట్స్
దేవాదాయ, ఇరిగేషన్, మరే ఇతరమైన ప్రభుత్వ భూములు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా ఖాళీగా ఉంటే వాటి సమాచారాన్ని పంపించాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఆ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడడంతోపాటు అక్కడ సోలార్ విద్యుత్ ప్లాంట్ ను ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భారీ, మధ్య తరహా ప్రాజెక్టులపై కూడా ఫ్లోటింగ్ సోలార్ ఏర్పాటుచేసి విద్యుత్ ఉత్పాదన చేసేలా ముందుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన సమాచారం కోసం ఇప్పటికే నీటిపారుదల శాఖకు విద్యుత్ శాఖ లేఖ రాసినట్లు తెలిపారు.
Also Read: KTR on Congress govt: ఆర్థిక వ్యవస్థను కాంగ్రెస్ ఖతం పట్టించింది.. కేటీఆర్ సంచలన కామెంట్స్!
హైడల్, పుంప్డ్ స్టోరేజ్, పవన విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు భట్టి వివరించారు. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా సరఫరా లోడ్ ను నియంత్రించడం కోసం రాష్ట్రవ్యాప్తంగా సబ్ స్టేషన్లను పెంచుకోవడం, అప్ గ్రేడ్ చేయడం, ట్రాన్స్ ఫార్మర్లను పెంచుకోవడం చేస్తున్నట్లు తెలిపారు. అందువల్లనే డిమాండ్ ఏ స్థాయిలో ఉన్నా.. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ ను అందించగలిగామని భట్టి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య, కలెక్టర్ నారాయణరెడ్డి, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ, కాంగ్రెస్ నాయకులు భీమ్ భరత్ తదితరులు పాల్గొన్నారు.

 Epaper
 Epaper  
			 
					 
					 
					 
					 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				