Viral Video: మనం సోషల్ మీడియాలో రోజూ ఎన్నో వైరల్ వీడియోలు చూస్తూంటాము. వాటిలో కొన్ని కొత్తగా, వింతగా ఉంటాయి. మరి కొన్ని, అయితే భయం కరంగా ఉంటాయి. ఇక ఇప్పుడు చెప్పుకోబోయే వీడియో కూడా అలాంటిదే. కోపం వస్తే మనుషులు ఎలా ప్రవర్తిస్తారో కూడా వారికే తెలియదు. ఇది, మనం మనుషుల వరకే చూశాము. కానీ, ఇక్కడ వింత ఏంటంటే వాహనాలు కూడా కోపం వస్తుంది. కోపం వస్తే అవి ఏం చేస్తాయో ఇక్కడ తెలుసుకుందాం..
Also Read: Viral Video: కెనడా మెట్రో స్టేషన్‌లో.. అలాంటి పని చేస్తూ.. కెమెరాకు చిక్కిన ఇండియా అమ్మాయి
సాధారణంగా బైక్ డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అయితే, ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోలో రెండు బైక్ లు ఒక దాని మీద ఒకటి ఎక్కి కొట్టుకుంటున్నట్లు చేశాయి. మనుషులు గొడవ జరిగినప్పుడు ఒకరి మీదకు ఇంకొకరు వెళ్ళి ఎలా దాడి చేసుకుంటారో ఇక్కడ బైక్స్ కూడా అలాగే చేశాయి. అది కూడా నడి రోడ్డు మీద అలా బిహేవ్ చేశాయి. అక్కడున్న ఇతర వాహన దారులు కూడా భయపడ్డారు. వాటిని సినిమా చూసినట్టు చూస్తున్నారు. ఎక్కడికక్కడ అన్ని అన్ని వాహనాలు నిలిచిపోయాయి.
ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనిని చూసిన నెటిజన్స్ లో కొందరు ఇది మనుషుల పని కానే కాదు. దెయ్యాలే చేశాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. మనుషులకే కాదు వాహనాలకు దెయ్యాలు పడితే ఇలాగే ఉంటుంది అంటూ కొందరు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.