Viral Video: విదేశాలకు వెళ్లి సెటిల్ కావడం ప్రస్తుతం చాలా మంది యువతకు డ్రీమ్ గా ఉంది. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడాలకు వెళ్లి మంచి జీతం, ఉద్యోగంతో సెటిల్ కావాలని చాలా మంది కలలు కంటున్నారు. అయితే కొందరు ఈ ప్రయత్నంలో సక్సెస్ అవుతుంటే మరికొందరు ఫెయిల్ అవుతున్నారు. విదేశాలకు వెళ్లిన కొందరు.. ఆదాయ మార్గం లేక అక్కడి పెట్రోల్ బంకులు, ఫుడ్ కోర్ట్స్ వద్ద పని చేస్తున్న ఉదంతాలు ఇటీవల చూస్తూనే ఉన్నాం. అయితే కెనడాలో ఓ భారతీయ యువతి భిక్షాటన చేస్తున్నట్లుగా ఉన్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
వీడియోలో ఏముందంటే?
కెనడాలోని ఓ మెట్రో స్టేషన్ లో భారతీయ యువతి నేలపై కూర్చొని ఉన్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ ప్రయాణికుడు ఈ దృశ్యాలను తన కెమెరాలో బంధించాడు. వైరల్ అవుతున్న వీడియోలో మెట్రో స్టేషన్ ఫుట్ పాత్ వద్ద ఓ యువతి కూర్చొని ఉంది. భిక్షాటన చేస్తున్నట్లుగా చేతిలో అట్టముక్క కూడా ఉంది. ఇది గమనించిన ఓ వ్యక్తి.. ఫోన్ లో వీడియో తీయడం ప్రారంభించాడు. అతడ్ని చూసిన ఆ యువతి.. ముఖానికి అట్టముక్క అడ్డుపెట్టుకుంది. ఫేస్ కనిపించకుండా జాగ్రత్త పడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయింది.
కెనడా మెట్రో స్టేషన్ లో ఆర్థిక సహాయం ఆర్దిస్తూ ఇలా కెమెరాకు చిక్కిన ఇండియా అమ్మాయి #canada #indians #uanow #nri pic.twitter.com/MIB7y0BnGh
— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) September 7, 2025
Also Read: Actress Navya Nair: నటికి బిగ్ షాక్.. మల్లెపూలు పెట్టుకుందని.. ఏకంగా రూ.1.14 లక్షల ఫైన్
నెటిజన్ల రియాక్షన్..
యువతి వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆర్థికంగా అంత కష్టపడుతూ ఆ దేశంలో ఉండటం అవసరమా? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ‘చూడటానికి చక్కగానే ఉందిగా. పైగా బాగా చదువుకున్నట్లు కూడా ఉంది. ఇలా అడుక్కొని బతకడం ఏంటీ? అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘పోనీలే తప్పేముంది. మరీ కష్టంలో ఉందేమే’ అని ఇంకొకరు కామెంట్ చేశారు. ‘తప్పుడు మార్గాలు ఎంచుకోకుండా అడుక్కొని జీవించాలని అనుకుంది. అందులో తప్పేముంది?’ అంటూ ఇంకొకరు రాసుకొచ్చారు. ‘ఇంత కష్టపడుతూ కెనడాలో జీవించడం అవసరమా? ఇండియాకు తిరిగి వచ్చేయండి సిస్టర్’ అంటూ ఇంకొకరు అభిప్రాయపడ్డారు.