Viral Video (Image Source: Instagram)
Viral

Viral Video: 52 ఏళ్లకు తండ్రి ఎంబీఏ పూర్తి.. కొడుకు ఇచ్చిన సర్ ప్రైజ్ పార్టీకి.. సోషల్ మీడియా షేక్!

Viral Video: వయసు కేవలం సంఖ్య మాత్రమేనని నిరూపిస్తూ ఓ 52 ఏళ్ల వ్యక్తి.. ఎంబీఏ పూర్తిచేశాడు. తద్వారా గొప్ప మైలురాయిని అందుకున్నాడు. అయితే తన తండ్రి లేటు వయసులోని లేటెస్ట్ గా ఎంబీఏ పూర్తి చేయడంతో అతడికి కుమారుడు కళ్లు చెదిరే సర్ ప్రైజ్ ప్లాన్ చేశాడు. తన ఫ్యామిలీ అందరితో కలిసి.. తండ్రికి ఎప్పటికీ గుర్తుండిపోయే ట్రీట్ ఇచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ సర్ ప్రైజ్ చేసి నెటిజన్లు సైతం ఖుషీ అవుతున్నారు.

ఇంతకీ సర్ ప్రైజ్ ఏంటంటే?
ముంబయికి చెందిన మైత్రేయ సాథే అనే యువకుడు.. తన ఇన్ స్టాగ్రామ్ లో ఖాతాలో ఓ వీడియోను షేర్ చేశాడు. 52 ఏళ్ల వయసులో ఎంబీఏ పూర్తి చేసిన తండ్రికి ఫ్యామిలీతో కలిసి ఏ విధంగా సర్ ప్రైజ్ పార్టీ ఇచ్చాడో అందులో చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇందులో కుటుంబ సభ్యులు మెుత్తం.. తండ్రి ముఖంతో ఉన్న మాస్కులను తగలించుకున్నారు. ఇది తెలియని ఆ తండ్రి.. రోజులాగే ఆఫీసు ముగించుకొని ఇంటికి వచ్చారు. అయితే డోర్ తీయగానే.. తన ఫేస్ తో ఉన్న మాస్కులతో కుటుంబ సభ్యులు అందరూ కనిపించడంతో అతడు ఒక్కసారిగా సర్ ప్రైజ్ అయ్యారు.

Also Read: Chicken Dosa Video: చికెన్ దోశ కోసం.. రెండుగా చీలిన సోషల్ మీడియా.. నెట్టింట ఒకటే రచ్చ!

నెటిజన్ల రియాక్షన్..
తండ్రికి కుమారుడు ఇచ్చిన సర్ ప్రైజ్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ వీడియోకు 3.25 లక్షలకు పైగా వ్యూస్ రావడం విశేషం. ఈ వీడియోను ఇంటర్నెట్ లో చూసిన అద్భుతమైన దృశ్యంగా పలువురు అభివర్ణిస్తున్నారు. ‘నేను 35 ఏళ్లకే MBA పూర్తి చేయడంలో ఇబ్బంది పడుతున్నాను. అంకుల్‌గారి నుండి కొన్ని సలహాలు కావాలి’ అంటూ ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. ‘ఎంత క్యూట్‌గా ఉంది వీడియో! అభినందనలు అంకుల్. మా అమ్మ కూడా 50 ఏళ్లకే మాస్టర్స్ చేసింది. ఆ ఆనందం నాకు తెలుసు’ అని మరొక యూజర్ పేర్కొన్నారు. ‘ఏ యూనివర్సిటీలో చేశారో తెలుసుకోవాలని ఉంది. సీనియర్లకు ఇలాంటి కోర్సులు ఎక్కడ అందుబాటులో ఉంటాయో కాస్త చెప్పండి’ అంటూ ఇంకొకరు రాసుకొచ్చారు.

Also Read: Viral Video: ఏనుగులనే హడలెత్తించిన.. డాడీ లిటిల్ ప్రిన్సెస్.. మీకో దండం తల్లి!

Also Read: Weight Loss Challenge: కొవ్వు కరిగించుకో.. రూ.లక్షల్లో బోనస్ దక్కించుకో.. ఉద్యోగులకు బంపరాఫర్!

 

Just In

01

Manoj Manchu: ‘మిరాయ్’ ఈవెంట్‌లో మనోజ్ మంచు ‘ఓజీ’ ప్రమోషన్.. ఇది వేరే లెవల్ అంతే!

Chanakya Niti: మీ బంధువులకు ఈ విషయాలు అస్సలు చెప్పకూడదని తెలుసా..

Pawan Kalyan: అల్లు అరవింద్ మదర్ పవన్ కళ్యాణ్‌ని ఏమని పిలిచే వారో తెలుసా?

Vimal Krishna: ‘డీజే టిల్లు’ దర్శకుడి తర్వాత చిత్రం, హీరో.. డిటైల్స్ ఇవే!

Hyderabad Collector: ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించిన.. జిల్లా కలెక్టర్ హరిచందన