Viral Video: కొందరు మహిళలు స్కూటీ నడపడంలో తడబడుతూ ఉంటారు. ముఖ్యంగా రోడ్లపైకి వచ్చిన సందర్భాల్లో వారు ఎదుటివారిని ఢీకొట్టడం లేదా ఇతర వాహనదారులను కన్ఫ్యూజ్ చేయడం వంటివి చేస్తుంటారు. అటువంటి వారిని నెటిజన్లు ‘డాడీ లిటిల్ ప్రిన్సెస్’ అని సెటైరికల్ గా అంటుంటారు. వారికి సంబంధించిన వీడియోలను అదే క్యాప్షన్ తో నెట్టింట వైరల్ కూడా చేస్తుంటారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. స్కూటీపై వచ్చిన ఇద్దరు మహిళలను చూసి ఏకంగా ఏనుగులే కంగారు పడటం చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు.
వీడియోలో ఏముదంటే?
వైరల్ అవుతున్న వీడియోను గమనిస్తే.. జనావాసాల్లోకి నాలుగు ఏనుగులు ఉన్న గుంపు ప్రవేశించింది. ఈ క్రమంలో ఖాళీ ప్రదేశంలో నుంచి రోడ్డుపైకి ఏనుగులు రావడాన్ని గమనించిన ఓ మహిళ కంగు తిని.. అక్కడే ఆగిపోయింది. ఈ క్రమంలో అటుగా స్కూటీపై వచ్చిన మరో మహిళ మాత్రం నేరుగా ఏనుగుల సమీపం వరకు దూసుకెళ్లింది. దీంతో కంగారు పడ్డ ఏనుగులు.. ఎక్కడ తమను ఢీకొడుతుందోనని ఒక్కసారిగా కంగారు పడ్డాయి. అన్ని ఒకేసారి వెనకడుగు వేశాయి. ఈ క్రమంలో మెుదటి మహిళ స్కూటీని అక్కడే పడేసి పరిగెత్తగా.. మరొక అమ్మాయి మాత్రం స్కూటీని సైడ్ గా ఆపింది. దీంతో గజరాజులు ఆమె పక్కగానే వడివడిగా ముందుకు కదిలాయి. మళ్లీ ఎక్కడ ఢీకొడుతుందన్న కంగారులో అవి వెళ్లినట్లు కనిపించాయి.
Even elephants get scared when they see a girl riding a scooter. 😅#GirlPower #Elephants pic.twitter.com/Oa5oRif0N6
— ಸನಾತನ (@sanatan_kannada) September 8, 2025
Also Read: Weight Loss Challenge: కొవ్వు కరిగించుకో.. రూ.లక్షల్లో బోనస్ దక్కించుకో.. ఉద్యోగులకు బంపరాఫర్!
నెటిజన్ల రియాక్షన్..
స్కూటీపై వచ్చిన మహిళను చూసి ఏనుగులు సైతం వెనక్కి తగ్గడంపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ‘ఆమె ఎక్కడ ఢీకొడుతుందోనని గజరాజులు సైతం వణికిపోయాయి’ అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. ‘తోటి మనుషులనే కాకుండా.. ఏనుగులను సైతం భయపెడుతున్నారా? మీకో దండం తల్లి’ అంటూ ఇంకొకరు రాసుకొచ్చారు. స్కూటర్ గార్ల్స్.. పులులు, సింహాలు, ఏనుగులు, ప్రకృతి కంటే చాలా ప్రమాదకరం’ అంటూ మరొకరు కామెంట్ చేశారు. ‘మహిళను చూడగానే ఏనుగు ఎలా భయపడిపోయిందో చూశారా?’ అంటూ ఓ యూజర్ సెటైర్లు వేశారు. ‘ఏనుగు బ్రో కొద్దిలో తప్పించుకున్నాడు. లేదంటేనా? అంటూ నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు.
Also Read: Viral Video: రెస్టారెంట్‌లో సీటు లొల్లి.. ఘోరంగా కొట్టుకున్న.. హోటల్ స్టాఫ్, కస్టమర్లు!