Viral Video: రాజస్థాన్ లో ఓ రెస్టారెంట్ లో తలెత్తిన వివాదం.. పరస్పర దాడులకు దారి తీసింది. హోటల్ స్టాఫ్, కస్టమర్లు ఒకరిపైఒకరు తీవ్రంగా దాడి చేసుకున్నారు. ఘర్షణ పడ్డ వారిలో మహిళలు సైతం ఉండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
అసలేం జరిగిందంటే?
జైపూర్‌లోని రెస్టారెంట్ లో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. సీటు రిజర్వేషన్ పై తలెత్తిన వివాదం గొడవకు దారితీసింది. నహార్గఢ్ కొండలపై ఉన్న పడావ్ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న ఈ దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దాదాపు 45 సెకన్ల ఉన్న వీడియోలో దాదాపు 15-20 మంది.. రెండు గ్రూపులుగా వీడిపోయి దాడి చేసుకున్నారు. మహిళలు కూడా రెస్టారెంట్ సిబ్బందిని కొడుతూ తమ భాగస్వాములను రక్షించడానికి ప్రయత్నించడం వీడియోలో గమనించవచ్చు.
Jaipur के नाहरगढ़ किले के रेस्टोरेंट में बवाल, लड़कियों के मारपीट, वीडियो वायरल हुआ pic.twitter.com/TyxUa5DSf4
— Rajasthan Tak (@Rajasthan_Tak) September 8, 2025
Also Read: Vande Bharat Sleeper Train: కళ్లు చెదిరే సౌకర్యాలతో.. వందే భారత్ స్లీపర్ రైలు.. పండగే పండగ!
స్టాఫ్ వేధించారని ఆరోపణలు
అధికారుల సమాచారం ప్రకారం.. ఈ ఘటన రాత్రి 8 గంటల సమయంలో జరిగింది. రెండు జంటలు డిన్నర్ కోసం రెస్టారెంట్‌కి వచ్చారు. వారు రిజర్వ్ చేసుకున్న సీటు విషయంలో సిబ్బందితో వాగ్వాదం ప్రారంభమైంది. అది కొద్దిసేపటిలోనే హింసాత్మక ఘర్షణగా మారింది. ఆ ఇద్దరు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేస్తూ రెస్టారెంట్ సిబ్బంది తమను వేధించారని తెలిపారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆ రెస్టారెంట్ రాజస్థాన్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (RTDC) ఆధ్వర్యంలో నడుస్తోంది. దీంతో ఈ ఘటనపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.