Rajasthan (Image Source: Twitter)
Viral

Rajasthan: 17వ సారి.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన.. 55 ఏళ్ల బామ్మ

Rajasthan: రాజస్థాన్‌ లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఉదయపూర్ జిల్లా ఝాడోల్ బ్లాక్‌ (Jhadol block)లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ (Community Health Centre) లో 55 ఏళ్ల రేఖా కల్బేలియా (Rekha Kalbelia) అనే మహిళ తన 17వ సంతానానికి జన్మనిచ్చింది. ప్రస్తుతం ఈ ఘటన దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అంతేకాదు ఈ బిడ్డను చూసేందుకు రేఖా కల్బేలియా మనవళ్లు మనవరాళ్లు కూడా రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

వివరాల్లోకి వెళ్తే..
ఉదయపూర్ జిల్లా లీలావాస్ గ్రామానికి (Lilavas village) చెందిన రేఖా,స కావరా రామ్ కల్బేలియా (Kavara Ram Kalbelia) భార్య భర్తలు. ఆమె ఇప్పటివరకూ 16 మందికి జన్మనిచ్చింది. 55 ఏళ్ల వయసులో తాజాగా 17వ సంతానానికి జన్మనిచ్చి రేఖా వార్తల్లో నిలిచారు. రేఖకు జన్మించిన 17 మంది సంతానంలో ఐదుగురు (నాలుగు అబ్బాయిలు, ఒక అమ్మాయి) పుట్టిన కొద్దిసేపటికే మృతి చెందారు. ప్రస్తుతం ఈ దంపతులకు ఏడుగురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు సహా 12 మంది సంతానం సజీవంగా ఉన్నారు.

పిల్లలకు పెళ్లిళ్లు.. మనవళ్లు
రేఖ భర్త రామ్ తెలిపిన వివరాల ప్రకారం.. వారి సంతానంలోని ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలకు ఇప్పటికే వివాహాలు జరిగాయి. వారు ఇద్దరు నుంచి ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు. రేఖా వారి పిల్లలకు అమ్మమ్మ/నానమ్మగా ఉండి కూడా మరో బిడ్డకు జన్మనిచ్చిందని భర్త రామ్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Kothagudem Politics: పొలిటికల్ వార్.. కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎవరు..?

ఆర్థిక సమస్యలు
అయితే రామ్, రేఖా కుటుంబ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉన్నట్లు తెలుస్తోంది. రామ్ చెత్తను శుభ్రం చేసే డీలర్ గా పనిచేస్తున్నారు. పిల్లల పెళ్లి కోసం అప్పుచేసి మరి డబ్బులు ఖర్చు చేసినట్లు రామ్ తెలిపారు. వాటికి సంబంధించి ఇప్పటికీ వడ్డీలు కడుతున్నట్లు చెప్పారు. అయితే తమ కుటుంబంలో ఎవరూ పాఠశాలలకు వెళ్లింది లేదని రామ్ వివరించారు.

Also Read: Building Collapse: మహా విషాదం.. కుప్పకూలిన అపార్ట్‌మెంట్.. 15 మంది మృత్యువాత

డాక్టర్ ఏమన్నారంటే?
రేఖా 17వ డెలివరీని పర్యవేక్షించిన డాక్టర్ రోషన్ దారంగి (Dr. Roshan Darangi) ఆమె కాన్పు గురించి మాట్లాడారు. తొలుత రేఖ ఇది నాల్గో ప్రసవమని చెప్పినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాతే తనకు 16 బిడ్డలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందని అన్నారు. ‘ఇంతమంది పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత గర్భాశయం బలహీనమవుతుంది. అధిక రక్తస్రావం జరిగే ప్రమాదం ఎక్కువ. తల్లికి ప్రాణహాని కలగొచ్చని భయం ఉంది. అదృష్టవశాత్తూ అన్నీ సజావుగానే జరిగాయి’ అని డాక్టర్ తెలిపారు.

Also Read: Actor Madhavan: భారీ వర్షాల ఎఫెక్ట్.. లద్దాఖ్‌లో చిక్కుకుపోయిన మాధవన్.. ఎటూ కదల్లేని స్థితిలో..

Just In

01

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?