Kothagudem Politics (imagecedit:swetcha)
తెలంగాణ

Kothagudem Politics: పొలిటికల్ వార్.. కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎవరు..?

Kothagudem Politics: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాజకీయాలు కొత్త దిశలో వెళ్తున్నాయి. కొత్తగూడెం నియోజకవర్గంలో ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా అందరి ఆసక్తి ఇక్కడే ఉంటుంది. ఇది భద్రాద్రి జిల్లాలో ఉన్న ఏకైక జనరల్ స్థానం కావడంతో ఈ పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడు తాజాగా కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటుతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన వెలువడటంతో నియోజకవర్గ రాజకీయాలు మళ్లీ ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ పరిణామాల్లో ఒకవైపు కమ్యూనిస్టు పార్టీ (CPI) తన బలం పెంచుకుంటుంటే, అధికార కాంగ్రెస్(Congress) మాత్రం నియోజకవర్గంలో నాయకత్వ లోపంతో వర్గపోరాటాలతో కొట్టుమిట్టాడుతోందట.

రాష్ట్రంలో ఏకైక కమ్యూనిస్టు స్థావరం

కొత్తగూడెం నియోజకవర్గం రాష్ట్రంలో ఏకైక కమ్యూనిస్టు స్థావరంగా నిలిచింది. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(MLA Kunamneni Sambasiva Rao) తన ప్రత్యేక శైలిలో నియోజకవర్గ రాజకీయాలను ప్రభావితం చేస్తున్నారట. సభలు, సమావేశాలు నిర్వహిస్తూ పార్టీకి బలం చేకూరుస్తున్నారట. ముఖ్యంగా శాసనసభలో తన ప్రావీణ్యాన్ని చాటుకుంటూ, ప్రతిపక్ష విమర్శలను అడ్డుకుంటూ, అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు. ఇక ప్రజా అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో సత్సంబంధాలను ఉపయోగించి నిధులను తెచ్చుకోవడం ఆయన ప్రత్యేకతగా మారింది. సిపిఐతోనే అభివృద్ధి సాధ్యం అన్న సందేశాన్ని కూనంనేని ప్రతి వేదికపై బలంగా వినిపిస్తున్నారట.

పార్టీ జిల్లా అధ్యక్షుడు పోడెం వీరయ్య పగ్గాలు..

భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పోడెం వీరయ్య(Podem Veeraiah) పగ్గాలు చేపట్టారు. అప్పటినుండి నియోజకవర్గాల సమన్వయకర్తగా వ్యవహరించడం జరుగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న ఐదు నియోజకవర్గాలలో నాలుగు నియోజకవర్గాలకు కాంగ్రెస్(Congress) పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిలు ఉన్నప్పటికీని జిల్లా కేంద్రమైన కొత్తగూడానికి నియోజకవర్గ అభ్యర్థి ఎవరు అనేది నియోజకవర్గం లో పెద్ద చర్చ నడుస్తోందట. ఎన్నికల ముందు నుండే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎడవల్లి కృష్ణ కు జనంలో ఉన్న ఆదరణ కాంగ్రెస్ పార్టీకి కాస్తో కూస్తో ఉపయోగపడుతుంది అనుకున్నారు.

Also Read: Hanumakoda District: వినాయక చవితి నేపథ్యంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ కీలక సూచన

పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రవేశం..

కానీ చివరకు మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి(ponguleti Srinivass Reddy) రంగప్రవేశం చేయడం ఆయన అప్పటికే ఆత్మీయ సమావేశాల పేరిట గత ఎన్నికలలో ముమ్మురంగా ఉమ్మడి ఖమ్మం(KHammam) జిల్లా వ్యాప్తంగా కలయ తిరగటం ప్రత్యేక కార్యకర్తలతో ముఖ్య సమావేశాలు ఏర్పాటు చేసుకోవటంతో పాటుగా, ఆయన అక్కడ ఒక కోటరిని ఏర్పాటు చేసుకున్నారట మరో వైపున పోడెం వీరయ్య కు సంబందించిన ఓ నేత కూడా ప్రస్తుతం అధికార పార్టీ పేరు చెప్పుకుని హవా కొనసాగిస్తున్నారట.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైలెంట్

కొత్తగూడెం నియోజకవర్గం లో బీఆర్ఎస్(BRS) పార్టీ తరుపున గెలిచిన గత మాజీ ఎమ్మెల్యేలు జలగం వెంకటరావు(Jlagam Venkata Rao), వనమా వెంకటేశ్వరరావు సైలెంట్ గా ఉండిపోతున్నారు. వారి ముఖ్య అనుచరులు సైతం సిపిఐ వైపు చేరడం కాంగ్రెస్‌కు పెద్ద దెబ్బ కానున్నదని అనుకుంటున్నారట. కొత్తగూడెం నియోజకవర్గ ఇంచార్జీ లేకపోవడమే ఇందుకు గల కారణం అనే టాక్ వినబడుతుందట. అక్కడ ఈ సెగ్మెంట్ లో అనేక దశాబ్దాల నుంచి కాంగ్రెస్ కు కంచు కోట గా ఉంటుందని.. ఈ నియోజకవర్గ ప్రజలు పోరాట పట్టిన తో పాటు ఉద్యమాలు సైతం చురుకైన పాత్ర పోషిస్తూనే మరోవైపున అభివృద్ధి అంటే కాంగ్రెస్ తోనే సాధ్యమని అక్క బలమైన నమ్మకంతో చెక్కుచెదరని ఓటు బ్యాంకుగా నిలుస్తుందననీ.. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ అభ్యర్థి నిలబడ్డ సునాయాసంగా గెలుపు దక్కించుకుంటారట. చరిత్ర ఉన్న కొత్తగూడెం నియోజకవర్గానికి అలాంటి చరిత్ర ఉన్న కొత్తగూడెం నియోజకవర్గానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ లేకపోవడంతో క్యాడర్లో కాస్త అలజడి మొదలవుతుందట.. పలితంగా ఇంచార్జీ అభ్యర్థి నీ అధికార పార్టీ నేతలు పూరించడంలో ఎందుకు వెనుకడుగు వేస్తున్నట్లు అంతుచిక్కని ప్రశ్నలు ఉత్పన్నమైతున్నవట.

పొంగులేటి వర్గీయుల హడావుడి

సమయం దొరికినప్పుడల్లా రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఎంపీ రామసాయం రఘురామిరెడ్డి పర్యటనలతో వాళ్ళ వర్గం నేతలు కాసేపు హడావిడీ చేయడం తప్ప పూర్తి స్థాయిలో క్యాడర్ ను బలోపేతం చేయలేక పోతున్నారట. పలితంగా గానే హస్తం పార్టీ బలహీనత స్పష్టంగా తెలుస్తుందట. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎంతవరకు నియోజక వర్గ ఇంచార్జీ ఎవరనేది స్పష్టం గా లేకపోవడం తో పార్టీ శ్రేణుల్లో కాస్త నిరాసక్తత ఉండట.. ఓ వైపు రాష్ట్రంలో సీఎం రేవంత్ సర్కార్ ప్రజారంజక పాలనతో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ముందుకు వెళ్తున్న తరుణంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను సైతం గ్రామస్థాయి ప్రజలకు చేరవేసే నాధుడు కూడా లేదని వాదన బలంగా వినిపిస్తుందట.

Also Read: Nara Lokesh: స్త్రీ శక్తికి కొత్త శక్తి.. ర్యాపిడోతో రాణిస్తున్న మహిళ.. నారా లోకేషే ఫిదా అయ్యారు!

స్థానిక సంస్థలు కాంగ్రెస్ కి అత్యంత ప్రాధాన్యం

ఈ పంచాయతీ ఎన్నికలు కాంగ్రెస్(Congress) పార్టీకి సాధారణ ఎన్నికల కంటే ఎక్కువ ప్రాధాన్యం ఉంది. ఇవే క్యాడర్‌కు దిశానిర్దేశం చేసే పోరాటాలు. సొంత నియోజకవర్గ అభ్యర్థి లేకుండా కేవలం మంత్రులపై ఆధారపడితే అధికార కాంగ్రెస్ పార్టీ కొత్తగూడెం నియోజకవర్గం లో మరింతగా పతనం అయ్యే అవకాశాలు ఉన్నాయని స్థానిక పార్టీ నేతలే చర్చించుకుంటున్నారట. మరోవైపు సిపిఐ(CPI) పార్టీ ముఖ్య నేతలు అందివస్తున్న ఈ అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొనేందుకు.. వ్యూహాలు రాసిస్తున్నారట. అదే జరిగితే కొత్తగూడెం నియోజకవర్గం పూర్తిగా కమ్యూనిస్టుల కంచుకోటగా మారిపోవడం ఖాయం అని కొత్తగూడెం ప్రజలు అనుకుంటున్నారట. మరోవైపున నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అభ్యర్థిగా ఎవర్నో ఒకరిని నియమిస్తే పార్టీ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు దోహద పడతాయని పార్టీ దిగువ స్థాయి క్యాడర్ చర్చించు కుంటున్నారట. అయితే పంచాయతీ పోరులో కాంగ్రెస్ పార్టీ అత్యధిక పంచాయతీలు గెలవాలంటే నియోజకవర్గ అభ్యర్థిని నియమించడమే మార్గమని పార్టీ సానుభూతి పరులు అనుకుంటున్నారట.

కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పూర్తి స్థాయిలో దృష్టి

కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని డిమాండ్ వినపడుతుంది. కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలో స్థానికంగా క్యాడర్‌ కు దిశా నిర్దేశం చేసే అభ్యర్థి లేకపోతే, రాష్ట్రం లో అధికారంలో ఉన్నా పార్టీకి నష్టమేట. జిల్లాలో ఉన్న కాంగ్రెస్ అగ్ర నాయకుల, ముఖ్య అనుచర గణం వర్గపోరాటాలను పక్కనపెట్టి, సమన్వయంతో ముందుకు వెళ్లకపోతే రాబోయే పంచాయితీ ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గంలో కాంగ్రెస్(Congress) పార్టీ ఉనికి మరింత బలహీనపడుతుందనే చర్చ అక్కడ బహిరంగంగానే జరుగుతోందట.

Also Read: BRS Party: నేతల కోసం గులాబీ వేట?.. పార్టీలో చేరినవారికి పదవుల ఆఫర్!

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?