CM Revanth Reddy
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

BioDesign Summit: దేవుడు గొప్ప డిజైనర్.. సీఎం రేవంత్ కీలక ప్రసంగం

BioDesign Summit: ప్రకృతి ఉత్తమ గురువు.. ప్రకృతిని విస్మరించవద్దు

2047 రైజింగ్ నినాదంతో పనిచేస్తున్నాం
తెలంగాణ లైఫ్ సైన్సెస్‌కు కేంద్రంగా మార్చుతాం
సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: దేవుడు గొప్ప డిజైనర్.. ప్రకృతి ఉత్తమ గురువు అని సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు. ఆదివారం బ‌యోడిజైన్ ఇన్నోవేషన్ స‌మ్మిట్-2025ోబ (BioDesign Summit) ఆయన ప్రసంగించారు. బయోడిజైన్ ఉపయోగించి వైద్య ఉత్పత్తులను తయారు చేయడం శ్రేయస్కరమని అన్నారు. మనిషి దేనినైన రూపొందిస్తే దాని ప్రయోజ‌నం, ప‌నితీరు, రూపం వంటివి ప్రాథమిక అంశాలుగా ఉంటాయని, అవి మానవ సమాజానికి ఉపయోగపడేలా ఉండాలన్నారు. లైఫ్ సైన్సెస్‌లో, వైద్యశాస్త్రంలో ప్రకృతి ఉత్తమ గురువే అంటూ కొనియాడారు. ప్రకృతి నుంచి చాలా నేర్చుకోవచ్చని, కానీ తప్పుడు మార్గంలోకి వెళ్లకూడదన్నారు. బయోడిజైన్‌కు మంచి ఉదాహరణ కృత్రిమ మేథస్సు అని పేర్కొన్నారు.

Read Also- RMPs: తెలంగాణలోని ఆర్ఎంపీల డిమాండ్లు ఇవే

మానవులు కృత్రిమ మెదడును సృష్టించడానికి సహజ మెదడును ఉపయోగించాల్సి ఉంటుందని రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. తాము తెలంగాణ రైజింగ్ 2047 అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామన్నారు. 2034 నాటికి తెలంగాణను వన్ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. తెలంగాణ లైఫ్ సైన్సెస్‌కు కేంద్రంగా ఉన్నదని, తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను సాధించడంలో వైద్య పరికరాలు, మెడ్‌టెక్ కీలకమైనవని అన్నారు. ఫార్మా, బయోటెక్, లైఫ్ సైన్సెస్ , మెడ్‌టెక్ వంటివి హైద‌రాబాద్‌లో అత్యంత కీల‌క‌మైన‌వని చెప్పారు. తయారీ రంగం నుంచి ఆవిష్కరణల‌కు కేంద్రంగా తెలంగాణ‌ను మారుస్తున్నామన్నారు. సుల్తాన్‌పూర్‌లో 302 ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద మెడికల్ డివైసెస్ పార్క్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఈ పార్క్‌లో ప‌రిశోధ‌న, పరీక్ష‌, తయారీ కోసం ఉత్తమ మౌలిక సదుపాయాలను అందిస్తున్నామన్నారు.

Read Also- Nandamuri Balakrishna: వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో బాలయ్యకు చోటు.. ఎందుకంటే?
ఇక్కడ 60కి పైగా దేశీయ‌, అంత‌ర్జాయతీయ కంపెనీలు ప‌నిచేస్తున్నాయని, డయాగ్నస్టిక్ పరికరాలు, ఇమేజింగ్ టెక్నాలజీలు, ఇంప్లాంట్లు, శస్త్రచికిత్స పరికరాలు, డిజిటల్ హెల్త్ సొల్యూషన్స్‌లో పెట్టుబడులు వస్తున్నాయన్నారు. స్థానిక స్టార్టప్‌లు, ఎంఎస్‌ఎంఈలు గ్లోబల్ కంపెనీలతో పాటు క‌లిసి ప‌నిచేస్తున్నాయన్నారు. సామాన్య ప్రజల సమస్యల ప‌రిష్కారం కోసం పరిశోధనలు నిర్వహిస్తున్న డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి , ఏఐజీ హాస్పిట‌ల్‌ను అభినందిస్తున్నానని రేవంత్ రెడ్డి చెప్పారు. చాలా ఏళ్లుగా మేథ‌స్సుని ఇత‌ర దేశాల ప్ర‌జ‌ల కోసం ఉప‌యోగిస్తున్నామన్నారు. ఇప్పుడు మ‌న ప్ర‌జ‌ల మంచి కోసం ప‌నిచేయాల్సిన స‌మ‌యం వ‌చ్చిందన్నారు. ప్ర‌భుత్వం నుంచి పూర్తి మ‌ద్ద‌తు ఉంటుందన్నారు. డేటా గోప్య‌తను పాటిస్తూనే ఇక్క‌డ ప్ర‌జ‌ల వైద్య‌స‌హాయం కోసం అవ‌స‌ర‌మైన డేటాను అందజేస్తామన్నారు. స్కిల్ యూనివ‌ర్సిటీ, కార్పొరేష‌న్లు, విద్యా సంస్థ‌లు, రీసెర్చ్ సెంట‌ర్స్‌తో అనుసంధానం చేస్తామన్నారు. ప్ర‌స్తుతం ప్ర‌పంచంలో అనిశ్చిత ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయని, ప‌న్నులు, యుద్ధాలు, వాణిజ్య‌ప‌ర‌మైన అడ్డంకులు వంటివి ఎదుర‌వుతున్నట్లు తెలిపారు. ఈ సమయంలో ఆవిష్కరణలు చేయడానికి తెలంగాణ సరైన వేదిక అంటూ రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

Just In

01

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?

Tummala Nageshwar Rao: రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై రైతు వేదికల వద్ద యూరియా అమ్మకం

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్