Building Collapse: మహారాష్ట్రలోని విరార్‌లో అక్రమంగా నిర్మించిన నాలుగంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ దుర్ఘటనలో ఇప్పటివరకూ 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. శిథిలాల కింద మరికొందరు ఉంటారని భావిస్తున్న అధికారులు.. సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మృతుల్లో ఓ మహిళతో పాటు ఆమె కుమార్తె (ఏడాది వయసు) ఉండటం మరింత ఆవేదనను కలిగిస్తోంది.
గత 20 గంటలుగా..
వసాయి విరార్ మున్సిపల్ కార్పొరేషన్ (VVMC) ఇచ్చిన సమాచారం ప్రకారం.. విజయ్ నగర్ లోని రమాబాయి అపార్ట్ మెంట్ వెనక భాగం కుప్పకూలింది. రాత్రి 12.05 ప్రాంతంలో కూలిపోయింది. అయితే భవనాన్ని అక్రమ కట్టడంగా వీవీఎంసీ పేర్కొంది. భవనం కూలిన సమాచారంతో హుటాహుటీనా ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు.. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఎన్డీఆర్ఎఫ్, మున్సిపల్ సిబ్బంది గత 20 గంటలుగా సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. తొలి దశలో చేతులతో శిథిలాలు తొలగించిన అధికారులు.. ఆపై యంత్రాలను ఉపయోగిస్తున్నారు.
రోడ్డున పడ్డ పలు కుటుంబాలు
జిల్లా కలెక్టర్ ఇందు రాణి జఖర్ (Indu Rani Jakhar) మాట్లాడుతూ.. ఇంకా కొందరు శిథిలాల కింద ఉండే అవకాశముందని తెలిపారు. ఈ ఘటనతో పలు కుటుంబాలు నిరాశ్రయులుగా మారారని పేర్కొన్నారు. వారిని చందన్సార్ సమాజ మందిరానికి తరలించి ఆహారం, నీరు, వైద్య సహాయం అందజేస్తున్నట్లు చెప్పారు.
🔴#BREAKING | A section of Ramabai Apartment in Maharashtra’s Virar East collapsed injuring several residents; 3 reportedly dead with over 20 people still trapped; 9 people have been rescued so far with operations still underway pic.twitter.com/BLB3lHczRm
— NDTV (@ndtv) August 27, 2025
మరణించిన వారి వివరాలు
ఇప్పటివరకూ 15 మంది ప్రాణాలు కోల్పోగా.. వారిలో ఏడుగురిని అధికారులు గుర్తించారు. ఆరోహి ఓంకార్ జోవిల్ (24), ఆమె కుమార్తె ఉత్కర్ష (1), లక్ష్మణ్ కిస్కు సింగ్ (26), దినేష్ ప్రకాష్ సప్కాల్ (43), సుప్రియా నివల్కర్ (38), అర్నవ్ నివల్కర్ (11), పార్వతి సప్కాల్ గా పేర్కొన్నారు. మృతుల్లో కొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. అధికారుల సమాచారం ప్రకారం మొత్తం 50 ఫ్లాట్లు ఉన్న ఈ భవనంలో కూలిపోయిన భాగంలో 12 ఫ్లాట్లు ఉన్నాయి. అది పడిన ప్రాంతం ఖాళీగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది.
The death toll in the Virar building collapse tragedy rose to 14 while rescue operations continue in Maharashtra’s Palghar district. Authorities have arrested the builder as NDRF teams search for possible survivors.#virarbuildingcollapse #Maharashtra #BuildingCollapse pic.twitter.com/XleEaRybhk
— The Daily Jagran (@TheDailyJagran) August 28, 2025
Also Read: Actor Madhavan: భారీ వర్షాల ఎఫెక్ట్.. లద్దాఖ్‌లో చిక్కుకుపోయిన మాధవన్.. ఎటూ కదల్లేని స్థితిలో..
బిల్డర్ అరెస్టు
భవనం కుప్పకూలిన ఘటనకు సంబంధించి బిల్డర్ నితల్ గోపినాథ్ సానే (Nital Gopinath Sane)ను పోలీసులు అరెస్ట్ చేశారు. భూమి యజమాని మీద కూడా కేసు నమోదు చేశారు. మహారాష్ట్ర రీజనల్ అండ్ టౌన్ ప్లానింగ్ (MRTP) చట్టంలోని 52, 53, 54వ సెక్షన్లు, భారతీయ న్యాయ సంహితలోని 105వ సెక్షన్ కింద నేరం మోపారు. వీవీ అసిస్టెంట్ కమిషనర్ గిల్సన్ గోన్సాల్వెస్ మాట్లాడుతూ ‘ప్రస్తుతం శిథిలాల తొలగింపు యుద్ధప్రాతిపదికన కొనసాగుతోంది. మొదటి గంటల్లో మున్సిపల్ బృందాలు, రెండు NDRF యూనిట్లు చేతితో శిథిలాలు తొలగించాయి. ఇప్పుడు యంత్రాలతో వేగంగా తొలగిస్తున్నారు’ అని తెలిపారు.
భవనం చరిత్ర
మున్సిపల్ అధికారుల లెక్కల ప్రకారం ఈ భవనం 2008–2009 మధ్య నిర్మించబడింది. ఇందులో 54 ఫ్లాట్లు, నాలుగు దుకాణాలు ఉన్నాయి. అయితే, నివాసుల సమాచారం ప్రకారం 2012లో కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది. మెుత్తంగా బిల్డింగ్ నిర్మాణంలో నాణ్యత లోపాలు ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.