NHPC 2025 : మంచి ఉద్యోగం కోసం చూసే వాళ్ళకి ఇది గుడ్ న్యూస్.. NHPC నాన్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 248 జూనియర్ ఇంజనీర్, సూపర్‌వైజర్ ఇతర పోస్టులకు ధర ఖాస్తులు కోరుతుంది. అర్హత, వయోపరిమితి, సిలబస్, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల గురించి ఇక్కడ చదివి తెలుసుకోండి.
నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (NHPC) రిక్రూట్‌మెంట్ 2025లో 248 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ధర ఖాస్తులు కోరుతుంది. B.Tech/B.E ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు 02-09-2025న ప్రారంభమయ్యి 01-10-2025 న ముగుస్తుంది. అభ్యర్థి NHPC వెబ్‌సైట్, nhpcindia.com ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
Also Read: Hyderabad: ట్యాంక్ బండ్ వద్ద గణనాథుల జోరు.. ఇప్పటికే లక్షన్నరకు పైగా విగ్రహాల నిమజ్జనాలు
NHPC నాన్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ 2025 నోటిఫికేషన్ PDF 28-08-2025న nhpcindia.comలో విడుదల చేయబడింది. పూర్తి ఉద్యోగ వివరాలు, ఖాళీ, వయోపరిమితి, దరఖాస్తు రుసుము, ఎంపిక ప్రక్రియ, ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇక్కడ వివరంగా తెలుసుకోండి.
దరఖాస్తు రుసుము
జనరల్/ EWS/ OBC కేటగిరీలకు: రూ. 600/- ప్లస్ వర్తించే పన్నులు అంటే దరఖాస్తుకు రూ.708/-
SC/ ST/ PwBD/ మాజీ సైనికులు/ మహిళా అభ్యర్థులకు: ఎటువంటి ఫీజు లేదు.
NHPC రిక్రూట్‌మెంట్ 2025 ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 02-09-2025
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 01-10-2025
Also Read: Japanese woman: అంతరిక్షంలో చిక్కుకున్నా.. ఆక్సిజన్ కావాలంటూ.. డబ్బు దోచేసిన ఫేక్ వ్యోమగామి
NHPC రిక్రూట్‌మెంట్ 2025 వయోపరిమితి
గరిష్ట వయోపరిమితి: 30 సంవత్సరాలు
జీతం
అసిస్టెంట్ రాజ్‌భాషా ఆఫీసర్ / (E1) / 40,000 – 1,40,000 (IDA)
జూనియర్ ఇంజనీర్ (సివిల్) /S1 29,600 – 1,19,500 (IDA)
జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) /S1 29,600 – 1,19,500 (IDA)
జూనియర్ ఇంజనీర్ (మెకానికల్) /S1 29,600 – 1,19,500 (IDA)
జూనియర్ ఇంజనీర్ (E & C) /S1 29,600 – 1,19,500 (IDA)
సూపర్‌వైజర్ (IT) / S1 29,600 – 1,19,500 (IDA)
సీనియర్ అకౌంటెంట్ /S1 29,600 – 1,19,500 (IDA)
హిందీ అనువాదకుడు / W06 27,000 – 1,05,000 (IDA)
Also Read: Strange incident: హుండీ దోచేసిన వారికి.. చుక్కలు చూపించిన అమ్మవారు.. దెబ్బకు తిరిగిచ్చేసిన దొంగలు!
NHPC నాన్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ 2025 ఖాళీల వివరాలు
పోస్ట్ పేరు మొత్తం
నాన్ ఎగ్జిక్యూటివ్
అసిస్టెంట్ రాజభాష అధికారి (E01) – 11
JE (Civil) (S01) – 109
JE (Elect.) (S01)- 46
JE (Mech) (S01) – 49
JE (E&C) (S01) – 17
సీనియర్ అకౌంటెంట్ (S01) – 10
సూపర్‌వైజర్ (IT) (S01) – 01
హిందీ అనువాదకుడు (W06) – 05