Youth Issues: ఈ మధ్య కాలంలో చాలా మంది ఫాస్ట్ ఫుడ్స్ కి అలవాటు పడుతున్నారు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో కొందరికి తినడానికి కూడా సమయం ఉండటం లేదు. ఆన్ లైన్లో ఆర్డర్ పెట్టుకుని తినడానికి ఇష్ట పడుతున్నారు. స్వంతగా ఇంట్లోనే చేసుకుని తినడానికి మొగ్గు చూపడం లేదు. దీని వలన ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా రెండు సమస్యలు బాగా వేధిస్తోన్నాయని వైద్యులు షాకింగ్ నిజాలు వెల్లడించారు. మరి, ఆ సమస్యలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..
30 ఏళ్ల లోపు వారికి అలాంటి సమస్యలు?
సాధారణంగా పెద్ద వాళ్లలో షుగర్ సమస్య రావడం సహజం. కానీ, విచిత్రంగా 30 ఏళ్ల లోపు వారికీ థైరాయిడ్, షుగర్ రావడం చూసి వైద్యులు కూడా షాక్ అవుతున్నారు. గాంధీ, ఉస్మానియా, ఉప్పల్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం, కుషాయిగూడ, హెల్త్ సెంటర్ తదితర ప్రాంతాల్లో 25- 28 ఏళ్ల వారిలో థైరాయిడ్, షుగర్ గుర్తించి డాక్టర్లు కూడా షాక్ అవుతున్నారు.
Also Read: Urea Supply: లోటు యూరియాను ఆగస్టు నెలతో కలిసి సరఫరాచేయాలి.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
పరిశోధనల్లో బయటపడ్డ నమ్మలేని నిజాలు..
అసలు వీరికి ఎందుకు ఇలాంటి సమస్యలు వస్తున్నాయని పరిశోధనలు చేయగా.. నమ్మలేని నిజాలు బయట పెట్టారు. జీవన శైలిలో కొత్త మార్పులు, ప్రాసెస్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, ఆహారపు అలవాట్లు మారటం, సరైన నిద్ర లేకపోవడం లాంటి కారణాలు వలనే అని డాక్టర్లు తెలిపారు. కాబట్టి, వీటికి దూరంగా ఉండటమే మంచిది. మీరు ఒక్క రోజు కడుపు నింపుకోవడం చూస్తున్నారు కానీ, వీటి వలన ఎన్ని అనారోగ్య సమస్యలు వస్తున్నాయో తెలుసుకోవడం లేదు. మీరు వంద రూపాయలు పెట్టి తింటే, తర్వాత హాస్పిటల్స్ కి వేలకు వేలు పెట్టాలి. ఇదంతా జరగకుండా ఉండాలంటే మీరు బయట ఫుడ్స్ మానేసి ఇంట్లో చేసుకుని తినడం మంచిది. అలా కాదని తింటే, వైద్యులు కూడా ఏం చేయలేని పరిస్థితులు వస్తాయి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. ఫాస్ట్ ఫుడ్స్ తినే కన్నా.. పండ్లు తిని ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
Also Read: Tollywood Hero: ‘జయం’ సినిమాకు రిజిక్ట్ చేశారు.. కట్ చేస్తే, ఇప్పుడు పాన్ ఇండియా ఆ హీరోకి దాసోహం!
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.