Tollywood Hero: ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు స్టార్ అవుతారో? ఎవరు డౌన్ అవుతారో? చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే, సినిమాలో కంటెంట్ ఉంటే.. తేజ సజ్జా వంటి హీరో కూడా సూపర్ హీరో అవుతున్నాడు. సినిమాలో కంటెంట్ లేకపోతే మెగాస్టార్, పవర్ స్టార్ సినిమాలైనా సరే.. సర్దేసుకుంటున్నాయి. ప్రేక్షకులు సినిమా చూసే కోణంలో చాలా మార్పు వచ్చింది. ఒకప్పుడు హీరోయిజాన్ని నమ్ముకుని సినిమాలు ఆడేవి. పలానా స్టార్ హీరో సినిమా అంటే చాలు బళ్లు, ట్రాక్టర్స్ వేసుకుని సినిమాలకు వెళ్లేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. కరోనా సమయంలో జనాలు ఇంటి పట్టునే ఉండి.. ఓటీటీల పుణ్యమా అని.. అన్ని భాషల సినిమాలను తిరగేశారు. అందులో కంటెంట్ బేస్డ్ సినిమాలకు బాగా అలవాటు పడ్డారు. అందుకే, బీభత్సమైన కంటెంట్ ఉన్న సినిమా అని టాక్ వస్తే తప్ప.. ఇల్లు వదిలి థియేటర్లకు రావడం లేదు. అందులోనూ ఒక ఫ్యామిలీ సినిమా థియేటర్‌కి వెళ్లి సినిమా చూడాలంటే వేలల్లో ఖర్చవుతుంది. అదే వేలు ఓటీటీలకు ఖర్చు చేస్తే ఫ్యామిలీ అంతా సంవత్సరం పాటు ఇంట్లోనే సినిమాలు చూడవచ్చనే కోణంలో ఆలోచిస్తున్నారు. అందుకే సాదారణ సినిమాలకు చూసేందుకు థియేటర్లకు జనాలు రావడం లేదనేది విమర్శకుల అభిప్రాయం.
Also Read- Sandhya Theatre Stampede: సంధ్య థియేటర్ పై మానవ హక్కుల కమిషన్ సీరియస్
సరే, అసలు విషయంలోకి వస్తే.. టాలెంటెడ్ డైరెక్టర్ తేజ (Director Teja) దర్శకత్వంలో నితిన్ హీరోగా వచ్చిన సినిమా ‘జయం’. ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడో వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో బాగా వైరల్ అవుతోంది. ‘జయం’ సినిమాకు మొదట అనుకున్న హీరో నితిన్ కాదట. మొదట అనుకున్న హీరోని దారుణంగా తేజ రిజిక్ట్ చేశాడట. ఇంతకీ ఆ హీరో ఎవరనుకుంటున్నారా? ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలతో ప్రపంచాన్ని షేక్ చేస్తున్న పుష్పరాజ్ అల్లు అర్జున్ (Allu Arjun). అవును.. ఇప్పటి ఐకాన్ స్టార్‌నే తేజ అప్పటి తన ‘జయం’ సినిమాకు రిజిక్ట్ చేశాడని.. తాజాగా అల్లు అర్జున్ మొదటి సినిమాకు కథని అందించిన చిన్నికృష్ణ చెప్పుకొచ్చారు. ఆయన ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టారు. అంతే ఒక్కసారిగా అంతా ఈ విషయాన్ని వైరల్ చేస్తున్నారు. నిజంగా ‘జయం’ సినిమాతో అల్లు అర్జున్ ఎంట్రీ ఇచ్చి ఉంటే.. ఇంత నేమ్, ఫేమ్ వచ్చేదో.. లేదో తెలియదు కానీ, ఆ సినిమా రిజిక్ట్ అవడమే మంచిదైంది అంటూ అల్లు ఆర్మీ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తుండటం విశేషం.
Also Read- Chiranjeevi: రాజకీయాల్లో లేకపోయినా నాపై విమర్శలు.. అయినా ఎందుకు స్పందించనంటే?
ఇక చిన్నికృష్ణ (Chinni Krishna) ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మొదట అల్లు అర్జున్ ‘జయం’ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం కావాలి. అన్ని మాట్లాడుకున్నారు. అధికారిక ప్రకటన కూడా వచ్చింది. దీనికై అల్లు అరవింద్ ఓ పార్టీని కూడా ఇచ్చారు. కానీ ఏమైందో ఏమో.. కొన్ని రోజుల తర్వాత నితిన్‌తో తేజ ‘జయం’ సినిమాను చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఆ ప్రకటన చూసి నేను షాకయ్యాను. వెంటనే అల్లు అరవింద్‌కు కాల్ చేసి అడిగా. కొన్ని ఇబ్బందులు వచ్చాయి. అందుకే ఆ సినిమా ఆగిపోయిందని అరవింద్ చెప్పారు. వెంటనే ఆయనతో అల్లు అర్జున్‌ని 365 రోజుల్లో ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యత నాదని మాటిచ్చా. ఆ తర్వాత ‘గంగోత్రి’ కథని సిద్ధం చేసి కె. రాఘవేంద్రరావుతో ఆ సినిమా చేశాం. ‘జయం’ ఆగిపోయినందుకు నిరాశకు లోనైన అల్లు అర్జున్.. ‘గంగోత్రి’ సినిమా సక్సెస్ కొట్టి.. ఇప్పుడు తిరుగులేని స్టార్ అయ్యాడు. వరుస సక్సెస్‌లతో దూసుకెళుతున్నాడు.. అని చిన్నికృష్ణ చెప్పుకొచ్చారు. అదీ విషయం.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు