Gadwal Farmers: గద్వాల్(Gadwal) పత్తి విత్తనోత్పత్తి రైతులకు త్వరగా న్యాయం చేయాలని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి విత్తన కంపెనీలను ఆదేశించారు. బీఆర్కే భవన్ లో గద్వాల్ లో పత్తి విత్తనోత్పత్తి చేసి నష్టపోయిన రైతుల అంశంపై కంపెనీ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ప్రధానంగా ఈ సమావేశంలో గద్వాల్ జిల్లాలో పత్తి విత్తనోత్పత్తి చేసి నష్టపోయిన రైతులకు వెంటనే న్యాయం చేయాలని విత్తన కంపెనీలకు సూచించింది.ఇప్పటికే కొంతమంది రైతులకు నష్టపరిహారం చెల్లించామని విత్తన కంపెనీలు పేర్కొన్నాయి.
Also Read: DGP Jitender: ఆర్థిక నేరాలపై దృష్టి పెట్టండి.. డీజీపీ కీలక సూచనలు
న్యాయం జరిగేలా చూడాలి
మరికొందరి రైతుల వివరాలు తమ వద్ద లేవనీ చెప్పడంతో.. నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం చేయాలని కమిషన్ ఆదేశించింది. అంతేకాదు పత్తి విత్తనోత్పత్తి చేసి నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చూడాలని గద్వాల్ జిల్లా కలెక్టర్ కు కమిషన్ లేఖ రాసింది. ఈ సమావేశంలో కమిషన్ సభ్యులు గోపాల్ రెడ్డి, గడుగు గంగాధర్, భూమి సునీల్, కమిషన్ అడ్వైజర్లు దొంతి నర్సింహారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సీడ్ మెన్ అసోసియేషన్ ప్రతినిధులు, విత్తన కంపెనీల యాజమన్యాలు, కమిషన్ మెంబర్ సెక్రెటరీ గోపాల్, ఏవో హరివెంకట ప్రసాద్ పాల్గొన్నారు.
Also Read: Air Bunched Cables: నగరంలో స్పెషల్ డ్రైవ్.. ప్రమాదకర విద్యుత్ లైన్లకు చెక్!