Medak ST Hostel: మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజక వర్గం మహ్మదాబాద్ గ్రామంలో నీ ఎస్టీ హాస్టల్(ST Hostel) ను ఏసీబీ అధికారులు తనిఖీ చేశారు. వీరితో పాటు ఫుడ్ ఇన్స్పెక్టర్(Food Inspector), శానిటరీ ఇన్స్పెక్టర్(Sanitary Inspector), తూనికలు కొలతల అధికారులు బృందంగా ఏర్పడి హాస్టల్ ను తనిఖీ చేశారు. హాస్టల్‌లో పరిసరాల పరిశుభ్రత లోపించడం, వాష్ రూమ్ లలో విద్యుత్తు, నీరు లేకపోవడం, ఆహారం విషయంలో నాణ్యత లోపం, హాస్టల్ లో విద్యార్థుల సౌకర్యాలు, భవనం, స్థితిగతులపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు.
రికార్డులు సరిగా లేకపోవడం, అధికారుల నిర్లక్ష్యం, పై చర్యలకు ప్రభుత్వానికి నివేదిక ను ఎసిబి(ACB) అధికారులు సమర్పించనున్నారు. 20024 నుండి హాస్టల్ వార్డెన్ గా రేఖ కొనసాగుతున్నారు. హాస్టల్ లో 81 మంది విద్యార్థులు ఉన్నారు. మౌలిక వసతులు తదితర అంశాలపై ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారు.
Also Read: Viral News: పక్కా ప్లాన్‌తో భర్తను చంపించింది… ఎలా దొరికిపోయిందంటే?
అధికారుల పై చర్యలకు
హాస్టల్ లో రికార్డుల నిర్వహణ తో పాటు, మౌలిక సదుపాయాలు, విద్యుత్, నీరు లేకపోవడం, తదితర అంశాలపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని ఎసిబి డిఎస్పీ సుదర్శన్(Sudharashan) తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సాధారణంగా తనిఖీలు చేయడం జరిగిందని ఏసీబీ డిఎస్పి సుదర్శన్ అన్నారు. మెదక్ జిల్లా నరసాపూర్ మండలం మహమ్మదాబాద్ గ్రామ సమీపంలో గల గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఏసీబీ తనిఖీలు చేశారు. పాఠశాల పరిసరాలు విద్యార్థులు ఉపయోగించే బాత్రూం(Wash Room)లో సరిగా లేవని తెలిపారు.
కొన్ని రికార్డులు కూడా పూర్తి వివరాలు నమోదు చేయలేదన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని తెలిపారు. పాఠశాలకు ప్రహరీ గోడ(Wall) మొత్తం లేదు వంటగది అపరిశుభ్రంగా ఉందని అన్నారు. ఇక్కడ సేకరించిన వివరాలను మొత్తం నమోదు చేసి ఉన్నతాధికారులకు పంపించడం జరుగుతుందని డీఎస్పీ సుదర్శన్ తెలిపారు. వారితోపాటు. తూనికలు కొలతల శాఖ ఫుడ్ ఇన్స్పెక్టర్, శానిటరీ ఇన్స్పెక్టర్ తదితరులు ఉన్నారు.
Also Read: Drug Peddlers Arrested: డ్రగ్ పెడ్లర్ అరెస్ట్.. 21కిలోల పాపీ హస్క్ సీజ్