Drug Peddlers Arrested ( IMAGE credit: swetcha reporter)
క్రైమ్

Drug Peddlers Arrested: డ్రగ్ పెడ్లర్ అరెస్ట్.. 21కిలోల పాపీ హస్​క్ సీజ్

Drug Peddlers Arrested: హైదరాబాద్ నార్కొటిక్ ఎన్ ఫోర్స్​ మెంట్ వింగ్ అధికారులు అంబర్ పేట్ పోలీసులతో కలిసి పాపీ హస్క్ గసగసాలతో తయారు చేసే మాదకద్రవ్యం) తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుని నుంచి 21కిలోల పాపీ హస్క్ ను స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ సుధీంద్ర(DCP Sudhindra) తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రాజస్తాన్ రాష్ట్రానికి చెందిన మంగళ్ రాం (44) కొంతకాలం క్రితం ఉపాధిని వెతుక్కుంటూ వచ్చి చెంగిచెర్లలో స్థిరపడ్డాడు. స్టీల్​ వెల్డింగ్ పని చేస్తూ జీవనం గడుపుతున్నాడు.

 Also Read: Vijay and Rashmika: బిగ్ షాక్.. సీక్రెట్ గా హల్దీ ఫంక్షన్ చేసుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక.. ఫోటోలు వైరల్

21 కిలోల పాపీ హస్​క్

అయితే, రాజస్తాన్​ లో ఉన్నప్పటి నుంచి మంగళ్​ రాంకు పాపీ హస్క్​ సేవించే అలవాటు ఉంది. దానిని ఇక్కడకు వచ్చిన తరువాత కూడా కొనసాగిస్తూ వచ్చిన మంగళ్​ రాం మరికొందరికి కూడా ఈ డ్రగ్ తీసుకునే అలవాటు ఉన్నట్టు తెలుసుకున్నాడు. ఈ క్రమంలో తేలికగా డబ్బు సంపాదించేందుకు తరచూ తన స్వగ్రామం వెళుతూ పెద్ద మొత్తంలో పాపీ హస్క్ ను తక్కువ ధరలకు కొని తెచ్చి ఇక్కడ ఎక్కువ ధరలకు అమ్ముతున్నాడు. ఎప్పటిలానే ఇటీవల ఊరికి వెళ్లి 21 కిలోల పాపీ హస్​క్ తీసుకొచ్చిన అతన్ని హైదరాబాద్​ నార్కొటిక్ ఎన్​ ఫోర్స్ మెంట్ వింగ్(Narcotic Enforcement Wing) అధికారులు, అంబర్ పేట్​ పోలీసులతో కలిసి అరెస్ట్ చేశారు. దీంట్లో కీలకపాత్ర వహించిన సీఐ జీ.ఎస్.డేనియల్​,)CI G.S. Daniel) ఎస్​ఐ వెంకటరాములు, అంబర్ పేట్ స్టేషన్​ డీఐ మహ్మద్​ హఫీజుద్దీన్, ఎస్​ఐ తరుణ్ కుమార్​ లను డీసీపీ సుధీంద్ర అభినందించారు. డ్రగ్స్ దందా గురించి తెలిస్తే 8712661601 నెంబర్ కు సమాచారం అందించాలని కోరారు.

Also Raed: Sc on Medical Colleges: మెడికల్ కాలేజీ అడ్మిషన్లపై సుప్రీంలో విచారణ

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు