Sc on Medical Colleges (imagecredit:swetcha)
తెలంగాణ

Sc on Medical Colleges: మెడికల్ కాలేజీ అడ్మిషన్లపై సుప్రీంలో విచారణ

Sc on Medical Colleges: వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చిన నివాస అర్హత నిబంధనను రద్దు చేసిన హైకోర్టు(High Cort) ఆదేశాలపై సుప్రీం కోర్టు(Supreme Courtలో విచారణ ముగిసింది. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్​ చేసింది. తెలంగాణ(Telangana) ప్రభుత్వం 2024లో తెలంగాణ మెడికల్​ అండ్​ డెంటల్​ కాలేజెస్​ అడ్మిషన్​ రూల్స్​ ను సవరించిన విషయం తెలిసిందే. వీటి ప్రకారం రాష్ట్రంలో 12వ తరగతి వరకు చివరి నాలుగేళ్లు చదువుకున్న విద్యార్థులకు మాత్రమే రాష్ట్ర కోటా కింద మెడికల్​ కాలేజీల్లో అడ్మిషన్లకు అర్హత ఉంటుంది. అయితే, దీనిపై పలువురు విద్యార్థులు గతంలో తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు నిబంధనను రద్దు చేస్తూ తీర్పు చెప్పింది.

అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యం 

కొంతకాలం రాష్ట్రం వెలుపల ఉన్నందున శాశ్వత నివాసులకు ప్రవేశాల్లో ప్రయోజనాలను తిరస్కరించ లేరని తీర్పులో పేర్కొంది. దీనిపై ప్రభుత్వం సుప్రీం కోర్టులో అప్పీల్ చేసింది. హైకోర్టు తీర్పు వల్ల కొత్త నిబంధనలు రూపొందించటానికి చాలా సమయం పడుతుందని అందులో పేర్కొంది. దీని వల్ల అడ్మిషన్ల ప్రక్రియ(Admissions process) ఆలస్యం అవుతుందని తెలియచేసింది. విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, దీని వల్ల సీట్ల కేటాయింపుల్లో జాప్యం జరుగుతుందని పేర్కొంది. అదే పమయంలో కొంతమంది విద్యార్థులు(Students) కూడా సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం స్థానికత నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చినట్టుగా కోర్టుకు తెలిపారు. తమకూ మినహాయింపులు ఇచ్చేలా ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించారు.

Also Read: Telangana: విశ్వవిద్యాలయాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం

రాష్ట్రపతి ఉత్తర్వుల ఆధారంగా

తెలంగాణలో పుట్టి 10వ తరగతి వరకు చదివినా స్థానిక కోటా(Local quota) దక్కటం లేదని పిటిషన్లలో పేర్కొన్నారు. 11, 12వ తరగతులు చదవని కారణంగా నీట్(Neet) లో స్థానిక కోటా దక్కక నష్టపోతున్నామని వివరించారు. వీటిపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ బీ.ఆర్​.గవాయ్​(Justice B.R. Gavai) జస్టిస్​ కే.వినోద్ చంద్రన్​(Justice K. Vinod Chandran)ల నేతృత్వంలోని ధర్మాసనం తాజాగా విచారణ జరిపింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్​ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ(Abhishek Singhvi) వాదనలు వినిపిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వుల ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ‘శాశ్వత నివాసి(‘Permanent resident’)’ని నిర్వరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుందని చెప్పారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ గవాయ్​(Justice B.R. Gavai) స్పందించారు.

చదువుకోవటానికి ఇతర ప్రాంతాలకు

ఈ నిబంధన వల్ల ఎదురయ్యే ఆచరణాత్మక ఇబ్బందులను ఉదాహరణలతో సహా వివరించారు. తెలంగాణ9Telanagana)కు చెందిన ఓ న్యాయమూర్తిని బీహార్​(Bihar) కు బదిలీ చేస్తే ఆయన కొడుకు 9, 10, 11, 12 తరగతులు అక్కడే చదివితే సొంత రాష్ట్రంలో ప్రవేశానికి అనర్హుడవుతాడా? అని ప్రశ్నించారు. తెలంగాణలో పుట్టి పెరిగి కోచింగ్​ కోసం 10, 11వ తరగతులు చదువుకోవటానికి ఇతర ప్రాంతాలకు వెళ్లే విద్యార్థుల పరిస్థితి ఏంటీ? అని అడిగారు. తెలంగాణకు చెందిన ఐఏఎస్​(IAS) అధికారి ఢిల్లీ(Delhi)కి బదిలీ అయి ఆయన పిల్లలు రెండేళ్లు రాష్ట్రం వెలుపల చదువుకుంటే వాళ్లను అనర్హులుగా ప్రకటిస్తారా? అని వ్యాఖ్యానించారు. జస్టిస్​ వినోద్ చంద్రన్​ వాదనలో పాలు పంచుకుంటూ ఒక వ్యక్తి నాలుగేళ్లు తెలంగాణలో ఖాళీగా ఉంటే అర్హుడు అవుతాడు చదువు కోసం బయటకు వెళితే మాత్రం అనర్హుడవుతాడు ఇది వైరుధ్యం కాదా? అని ప్రశ్నించారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం సుప్రీం కోర్టు తన తీర్పును రిజర్వ్​ చేసింది.

Also Read: Guest Lecturers: 6 నెలలుగా వేతనాలు పెండింగ్.. ఆర్థికశాఖ కొర్రీలు

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ