NSUI
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Telangana: విశ్వవిద్యాలయాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం

Telangana: తెలంగాణ విశ్వవిద్యాలయానికి ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేసిన సందర్భంగా ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరదబట్టు వేణు రాజ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చౌరస్తా వద్ద సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి,  రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించి అనంతరం పటాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వేణు రాజ్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల అభివృద్ధి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని అన్నారు.

విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు

విశ్వవిద్యాలయాలు స్థాపించాలన్నా, విద్యార్థులకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించి వారి ఉన్నత భవిష్యత్తుకు బాటలు వేయాలన్నా అది కేవలం కాంగ్రెస్ వల్లే అవుతుందని వివరించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కలగానే మిగిలిపోయిన తెలంగాణ విశ్వవిద్యాలయ ఇంజినీరింగ్ కళాశాల కాంగ్రెస్ ప్రభుత్వంలో సాకారం అయిందని, దీనికి గల కారణం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నత విద్య పట్ల ఉన్న చిత్తశుద్ధి అని అన్నారు. విశ్వ విద్యాలయానికి ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేయడంలో జిల్లాకు చెందిన కాంగ్రెస్ అగ్ర నాయకులందరూ ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు.

వారిదే కీలక పాత్ర 

పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మొదటి నుండి విశ్వవిద్యాలయం అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని వేణు రాజ్ అన్నారు. అలాగే, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి నియోజకవర్గంలో విశ్వవిద్యాలయం ఉన్నందున ఇంజినీరింగ్క ళాశాలను తీసుకురావడానికి అనునిత్యం ఈ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డికి గుర్తు చేస్తూ మంజూరులో కీలక పాత్ర పోషించారని వివరించారు.

Read Also- Shubman Gill: టెస్టుల్లో 46 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్

ఎన్ఎస్‌యూఐ కృషి

గత పది సంవత్సరాలు ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగమైన ఎన్ఎస్‌యూఐ ఆధ్వర్యంలో తెలంగాణ విశ్వవిద్యాలయానికి ఇంజినీరింగ్ కళాశాల కేటాయించాలని అనేక సార్లు ధర్నాలు, రాస్తారోకోలు చేసినట్టు తెలిపారు. అప్పటి ప్రభుత్వ నాయకులకు ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా స్పందించలేదని గుర్తు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఇంజినీరింగ్ కళాశాల సాధించడంలో ఎన్ఎస్‌యూఐ పాత్ర మరువలేనిదని వివరించారు. భవిష్యత్తులో కూడా విశ్వవిద్యాలయానికి కావలసిన అన్ని వసతులు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని, తెలంగాణ విశ్వవిద్యాలయానికి బడ్జెట్‌లో కేటాయింపులు కూడా ప్రజా ప్రభుత్వంలో పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయమే కాకుండా రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్‌యూఐ, కాంగ్రెస్ నాయకులు నవీన్, రమేష్, గంగప్రసాద్, నరేందర్ సింగ్, సాయి కిరణ్, కౌశిక్, మణి, రాజు
తదితరులు పాల్గొన్నారు.

Read Also- Pawan Kalyan OG: ‘ఓజీ’ నుంచి ఫస్ట్ అప్డేట్.. ‘ఫైర్ స్టోమ్’ ఆన్ ది వే..

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు