shubman gill
Viral, లేటెస్ట్ న్యూస్

Shubman Gill: టెస్టుల్లో 46 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్

Shubman Gill: ఐదు మ్యాచ్‌ల ‘అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ’లో చివరిదైన టెస్ట్ మ్యాచ్ లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానం వేదికగా ఆరంభమైంది. టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆరంభంలోనే రెండు కీలకమైన వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (2), కేఎల్ రాహుల్ (14) స్వల్ప స్కోర్లకే పెవీలియన్ చేరారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన యువ ఆటగాడు సాయి సుదర్శన్‌తో కలిసి కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే, దురదృష్టవశాత్తూ వ్యక్తిగత స్కోరు 21 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు.

కెప్టెన్ గిల్ త్వరగానే ఔట్ అయినప్పటికీ ఒక చారిత్రాత్మక రికార్డు నెలకొల్పాడు. 46 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టాడు. ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్‌గా గిల్ నిలిచాడు. ఈ జాబితాలో ఇన్నాళ్లూ అగ్రస్థానంలో నిలిచిన లెజెండరీ బ్యాటర్ సునీల్ గవాస్కర్‌ను వెనక్కి నెట్టేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో వ్యక్తిగత స్కోరు 11 పరుగులకు చేరుకున్నప్పుడు, ఈ సిరీస్ మొత్తంలో శుభ్‌మన్ గిల్ మొత్తం పరుగులు 733 పరుగులకు చేరాయి. తొమ్మిది ఇన్నింగ్స్ 92.12 సగటుతో ఈ పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి. బెస్ట్ స్కోరు 269 పరుగులుగా ఉంది.

Read Also- Tamil Nadu: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. మార్నింగ్ వాక్‌లో సీఎంని కలిసి…

ఇక, 1978-79లో వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో గవాస్కర్ 6 టెస్టు మ్యాచ్‌లు ఆడి 9 ఇన్నింగ్స్‌ల్లో 91.50 సగటుతో 732 పరుగులు సాధించారు. ఆ సిరీస్‌లో గవాస్కర్ 4 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ సాధించారు. అత్యధిక స్కోరు 205 పరుగులుగా. 46 ఏళ్లక్రితం సాధించిన ఈ రికార్డును గిల్ చెరిపివేశాడు. కెన్నింగ్టన్ ఓవల్ టెస్టులో రెండవ ఇన్నింగ్స్‌లో కూడా బ్యాటింగ్ చేయనుండడంతో ఈ ఆధిక్యం మరింత పెరగనుంది.

Read Also- Khushboo Patani: స్వామీజీపై బాలీవుడ్ బ్యూటీ సోదరి విమర్శలు.. ఏం జరిగిందంటే?

కాగా. ఇంగ్లండ్‌తో జరుగుతునన టెస్టు సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ అద్భుత ఫామ్‌ కనబరిచాడు. తన కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్నాడు. 1999 సెప్టెంబర్ 8న పంజాబ్‌లో పుట్టాడు. రైట్ హ్యాండ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా సక్సెస్ అవుతున్నాడు. టెంపరమెంట్, క్లాస్, స్పిన్నర్లపై ఫుట్‌వర్క్, స్ట్రోక్‌ప్లేతో అదరగొడుతున్నాడు. కెరీర్ విషయానికి వస్తే, టెస్టుల్లో 2020లో ఆస్ట్రేలియాపై అరంగేట్రం చేశాడు. వన్డేల్లో 2019లో, టీ20ల్లో 2023లో అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. వన్డేల్లో 2023లో న్యూజిలాండ్‌పై డబుల్ సెంచరీ నమోదు చేశాడు. ఏకంగా 208 పరుగులు సాధించాడు. 2023లో ఐసీసీ ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు పొందాడు. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున 2023 సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ విన్నర్‌గా నిలిచాడు.

Read also- Dharmasthala: 6వ స్థలంలో మానవ అవశేషాలు గుర్తింపు.. ఆ వ్యక్తివేనా?

Just In

01

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?