Dharmasthala case
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Dharmasthala: 6వ స్థలంలో మానవ అవశేషాలు గుర్తింపు.. ఆ వ్యక్తివేనా?

Dharmasthala: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ధర్మస్థల సామూహిక సమాధుల కేసులో కర్ణాటక పోలీసులు కీలక పురోగతి సాధించారు. మంగుళూరులోని ప్రముఖ ధ్యాన, పుణ్య క్షేత్రం ధర్మస్థలలో (Dharmasthala) తవ్వకాలు మొదలుపెట్టిన 6వ స్థలంలో ఎముకలు, పుర్రె, అస్థి పంజరం లభ్యమయ్యాయి. తవ్వకాలు మొదలుపెట్టిన కొద్దిసేపటికే ఇవి లభ్యమయ్యాయి. హిటాచీ ఎక్స్కావేటర్‌ను ఉపయోగించి ఈ తవ్వకాలు చేపడుతున్నారు. గురువారం గంటన్నరసేపు తవ్వకాలు జరపగా మానవ అవశేషాలు కనిపించాయి. ఇందుకు సంబంధించిన ఆధారాలను అధికారులు ఫోర్సెనిక్ ల్యాబ్‌కు పంపించారు. అయితే, ఆధారాల లభ్యతపై సిట్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. ప్రాథమికంగా ఆధారాలు లభ్యం అవుతుండడంతో ఈ స్థలంలో మరింత లోతుగా తవ్వాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. దీంతో, స్థలాన్ని సిట్ మరింత జాగ్రత్తగా పరిశీలిస్తోంది.

కాగా, నేత్రావతి నదికి సమీపంలో 1 నుంచి 8 స్థలాలు, రహదారికి సమీపంలో 9 నుంచి 13వ స్థలాలకు సిట్ అధికారులు రెడ్‌మార్క్ చేశారు. రోడ్డుకు పక్కనే ఉన్న 9వ స్థలం నుంచి కీలక ఆధారాలు లభ్యం అవుతాయని సిట్ అధికారుల ముందు విజిల్ బ్లోయర్ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, 6వ స్థలంలోనే ఎముకలు, పుర్రె లభ్యం కావడంతో మున్ముందు జరపబోయే తవ్వకాల్లో మరిన్ని ఆధారాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి.

Read Also- Oval Test: భారత్-ఇంగ్లండ్ మధ్య మొదలైన 5వ టెస్ట్.. టీమ్‌లో 3 మార్పులు

కేసులో భాగంగా మానవ అవశేషాలు లభించిన తొలి స్థలంగా నిలిచింది. లభించిన అవశేషాలు పురుషుడివిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ అవశేషాలు ఓ మాజీ పారిశుధ్య కార్మికుడివి కావొచ్చని సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. మహిళలు, బాలికల మృతదేహాలను ఖననం, దహనం చేయాలంటూ 1998 నుంచి 2014 మధ్యకాలంలో పలువురు వ్యక్తులు తనను బలవంతం చేశారంటూ సదురు కార్మికుడు సంచలన ఆరోపణలు చేశాడు. ఈ ఘటనలన్నీ ధర్మస్థల పుణ్యక్షేత్రంలోనే జరిగాయని అతడు చెప్పాడు.

మరోవైపు, కీలక ఆధారాలు బయటపడుతున్న నేపథ్యంలో ఫోరెన్సిక్ బృందం అక్కడ లభ్యమైన అవశేషాలను భద్రపరిచి, తదుపరి పరీక్షల కోసం పంపించింది. ప్రత్యేకంగా శిక్షణ పొందిన శునకాల టీమ్‌ను కూడా రంగంలోకి దింపారు. మరిన్ని ఆధారాలను గుర్తించేందుకు తవ్వకాలు విస్తరించారు. కాలప్రభావం, వాతావరణ పరిస్థితుల కారణంగా ఎముకలు చెల్లాచెదురయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ స్థలంలో రెండు మృతదేహాలు పాతిపెట్టినట్టు ఓ వేగు (whistleblower) ఆరోపణలు చేయడంతో అధికారులు దానిని దృష్టిలో ఉంచుకుని విచారణ కొనసాగిస్తున్నారు.

Read Also- Malegaon Case: మాలేగావ్ పేలుళ్ల కేసులో సంచలన తీర్పు.. బీజేపీ మాజీ ఎంపీ సహా అందరూ నిర్దోషులే

లభ్యమైన ఎముకలు పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయని తెలుస్తోంది. ఎముకలు లభ్యమైన ప్రదేశానికి కాస్త పక్కనే జరిపిన తవ్వకాలలో కొన్ని సామాన్లు కూడా బయటపడ్డాయి. తాళ్లు, దుస్తులు, ఒక ప్రింటర్, లాప్‌టాప్ వంటి వస్తువులు ఉన్నాయి. వీటిని కూడా ఆధారాలుగా చేసుకొని, విచారణ చేయాలని సిట్ అధికారులు భావిస్తున్నారు.

గురువారం (జులై 31) నాటికి ధర్మస్థల సామూహిక సమాధుల కేసులో గుర్తించిన ఐదు ప్రాంతాల్లో ఎలాంటి మానవ అవశేషాలు దొరకలేదని పోలీసు వర్గాలు నిర్ధారించాయి. విజిల్ బ్లోయర్ చెప్పినట్టుగానే నెత్రావతి నదికొండ వద్ద తవ్వకాలు జరపగా, అక్కడ నీరు చేరిన కారణంగా ఎలాంటి అవశేషాలను గుర్తించలేకపోయారు. ఈ కేసులో విజిల్ బ్లోయర్ మొత్తం 15 అనుమానాస్పద ప్రదేశాలను గుర్తించాడు. 8 ప్రదేశాలు నెత్రావతి నది ఒడ్డున ఉన్నాయి. 9 నుంచి 12 వరకు ప్రదేశాలు నది పక్కనే ఉన్న హైవే పక్కన ఉన్నాయి. 13వ ప్రదేశం నెత్రావతి నుంచి ఆజుకురికి వెళ్లే రోడ్డు పక్కన ఉంది. 14, 15 ప్రదేశాలు హైవే పక్కనే ఉన్న కన్యాడి ప్రాంతంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో 6వ సైట్ వద్ద లభించిన అవశేషాలు (పాక్షిక అవశేషాలు) విజిల్ బ్లోయర్ చేసిన ఆరోపణలకు బలంగా చేకూర్చే కీలక ఆధారంగా పరిగణినిస్తున్నారు. ఫోరెన్సిక్ విశ్లేషణ తర్వాత ఆరోపణల్లో నిజం ఉందా లేదా అన్న దానిపై ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉంటుంది.

 

Just In

01

TGSRTC: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇకపై ఆర్టీసీ ఏఐ వినియోగం.. ఎందుకో తెలుసా?

Thummala Nageswara Rao: మంత్రి హెచ్చరించినా.. మారని ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఉద్యోగుల తీరు!

GHMC: ముగిసిన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ భేటీ.. కీలక అంశాలపై చర్చ!

Minister Sridhar Babu: గ్లోబల్ హెల్త్ కేర్ హబ్’గా హైదరాబాద్: మంత్రి శ్రీధర్ బాబు

High Court: టీజీపీఎస్సీ హైకోర్టులో భారీ ఊరట.. నియామకాలు చేపట్టవచ్చని డివిజన్​ బెంచ్​!