Vijay and Rashmika: గత కొంత కాలం నుంచి రౌడీ హీరో విజయ్ దేవరకొండ ( Vijay Deverakonda ), నేషనల్ క్రష్ రష్మిక మందన్నా( Rashmika Mandanna) డేటింగ్‌లో ఉన్నారంటూ ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చాయి. ఇప్పటికే అనేక సార్లు మీడియాకి దొరికిపోయారు. కొన్ని మీడియా సంస్థలు కూడా వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు రాసుకొచ్చారు. అయితే, వీరి సంబంధాన్ని అధికారికంగా వెల్లడించనప్పటికీ.. కలిసి బయటకు వెళ్లడం, ఇద్దరూ ఒకే చోట కనిపించడం, వంటివి వార్తలకు మరింత బలాన్ని అందించాయి. ఈ క తాజాగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: Naa anveshana: నా అన్వేష్ తో అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య.. సంచలనం రేపుతున్న ఆడియో కాల్
సీక్రెట్ గా హల్దీ ఫంక్షన్ చేసుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక?
అయితే, వీరిద్దరూ పెళ్లి చేసుకున్నట్లుగా ఉన్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసి కొందరు షాక్ అయి ఏంటి నిజంగానే పెళ్లి చేసుకున్నారా? ఫ్యాన్స్ ఇది నిజంగా బిగ్ షాక్ అని కొందరు అంటున్నారు. ఇక, ఇప్పుడు తాజాగా విజయ్ దేవరకొండ, రష్మిక సీక్రెట్ గా హల్దీ ఫంక్షన్ (Haldi function) చేసుకున్న ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ ఫోటోలలో ఇద్దరూ సంతోషంగా కనిపిస్తున్నారు. వధూవరులుగా సాంప్రదాయ దుస్తులలో కనిపించారు. పసుపు బట్టలతో ఇద్దరూ మెరిసిపోతున్నారు. అయితే, ఈ ఫోటోలు అభిమానులు AI టూల్స్ ద్వారా సృష్టించినట్లు తెలుస్తుంది.
Also Read: Chitralayam Studios: మూడో సినిమాకు శ్రీకారం చుట్టిన చిత్రాలయం స్టూడియోస్.. ఈసారి రూటు మార్చారు!
నెటిజన్ల రియాక్షన్ ఇదే
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లి చేసుకున్నారనే వార్తలు 2025 జులైలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మా రౌడీ హీరో అష్ట కష్టాలు పడి హిట్ కొట్టాడు.. కొంచం కింగ్డమ్ సక్సెస్ ను ఎంజాయ్ చేయనివ్వండి. అప్పుడే మొదలు పెట్టారా? అయితే, ఈ ఫోటోలు నిజం కావని అందరికి తెలుసు. కేవలం AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాయంతో సృష్టించిన ఫోటోలు అని కొందరు మెసేజ్ లు చేస్తున్నారు. ఇంకొందరు ఏంటి నిజంగానే వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారా? అని సందేహాలు వ్యక్తం చేయగా.. మరికొందరు ఇవేం పట్టించుకోకండని చెబుతున్నారు.
Also Read: Mulugu Development: ఫలించిన సీతక్క పోరాటం.. ములుగు అభివృద్ధికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్