Naa anveshana: ప్రముఖ యూట్యూబర్ ” నా అన్వేష్” గా పరిచయమయ్యి ప్రపంచ యాత్రికుడిగా పేరు గాంచి దేశాలు చూట్టు తిరుగుతూ తెలియని ప్రదేశాలను చూపిస్తున్నాడు. అతను యూట్యూబ్ ఛానెల్‌లో ప్రపంచంలోని వివిధ ప్రాంతాల సంస్కృతి, జీవనశైలి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటాడు. భారత దేశంలోనే బెస్ట్ ట్రావెలర్ లిస్ట్ లో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. మొన్నటి వరకు బెట్టింగ్ యాప్స్ చేసే వారిపై వీడియోలు చేసి పాపులారిటీని సంపాదించాడు. దీనిని నెటిజన్స్ కూడా మెచ్చుకున్నారు. అయితే, తాజాగా నా అన్వేష్, అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్యతో మాట్లాడిన ఆడియో లీక్ అయింది. ఇది నెట్టింట బాగా వైరల్ అవుతుంది. దీన్ని చూసిన నెటిజన్స్ కూడా షాక్ అవుతున్నారు. అసలు ఆ ఆడియో కాల్ లో ఏం మాట్లాడుకున్నారో ఇక్కడ తెలుసుకుందాం..
Also Read: Ponguleti Srinivasa Reddy: ప్రజా పాలనలో ప్రభుత్వ స్కూళ్లలో ప్రమాణాలు పెరిగాయి: మంత్రి పొంగులేటి
ఆ ఆడియోలో ” ఈ పింక్ బుగ్గల పాప, నా అన్వేష్ ఆడియోలు లీక్ అయ్యాయి అంటూ ఓ ట్రోలర్ వీడియోను షేర్ చేశాడు. ప్రస్తుతం, ఈ ఆడియో కాల్ సంచలనం రేపుతోంది.
అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య : ఎలా ఉన్నారు? కొంచం మీ నెంబర్ ఏమైనా ఇస్తారా? మీతో మాట్లాడాలి?
నా అన్వేష్ : ఏమైంది అసలు? ఈ గొడవ అంతా ఏంటి ?
అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య : మీరు ఒక్కరే అంత దూరం వెళ్లిపోయి వీడియోలు తీసుకుంటారా? జాబ్ చేయడం లేదా? ఒకవేళ జాబ్ చేసి మానేశారా?
నా అన్వేష్ : హ చేసుకుంటాను
Also Read: Guvvala Balaraju: గులాబీని ఖాళీ చేసేలా కమలం స్కెచ్.. లోకల్‌కు ముందే దెబ్బకొటేలా ప్లాన్
అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య : మీరు ఇండియా ఎప్పుడు వస్తారు?
నా అన్వేష్ : మీరు ఇందాక అడిగిన దానికి నాకెవ్వరూ అసిస్టెంట్ లేరు అండి. త్వరలో ఇండియా వస్తాను.
అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య : మీరు మొత్తం యూట్యూబ్ వీడియెల మీదే డిపెండ్ అయ్యారా? లేక ఇంకా వేరేవి చేస్తూ సంపాదిస్తున్నారా ?
నా అన్వేష్ : ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు అంటూ ఫైర్ అయ్యాడు.