Minister Ponguleti Srinivasa Reddy(IMAGE credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Ponguleti Srinivasa Reddy: ప్రజా పాలనలో ప్రభుత్వ స్కూళ్లలో ప్రమాణాలు పెరిగాయి: మంత్రి పొంగులేటి

Ponguleti Srinivasa Reddy: ప్రభుత్వ స్కూళ్లలో గతంలో కంటే ఇప్పుడు ప్రమాణాలు పెరిగాయని, ఉపాధ్యాయులు బాగా చదువు చెబుతున్నారని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటిశ్రీనివాసరెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) అన్నారు.  ఏదులాపురం జడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఏదులాపురం మున్సిపాలిటీ, ఖమ్మం రూరల్ మండలం, ఖమ్మం(Khammam) మున్సిపల్ కార్పోరేషన్ లోని 1, 59, 60 డివిజన్‌లలోని 8వ తరగతి చదువుతున్న 191 మంది పేద విద్యార్ధినిలకు పి ఎస్ ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ తరపున సైకిళ్లు మంత్రి పొంగిలేటి అందజేశారు.

 Also Read: Gadwal District: ప్రభుత్వ హాస్టల్ విద్యార్థుల సమస్యలపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి

విద్య, వైద్యానికి పెద్ద పీట

ఈ సందర్భంగా మంత్రి పొంగిలేటి (Minister Ponguleti Srinivasa Reddy) మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యార్ధులకు నాణ్యమైన భోజనం పెట్టేందుకు డైట్ చార్జీలను 40 శాతం, విద్యార్థినుల కాస్మోటిక్స్ చార్జీలను 200 శాతం పెంచిందన్నారు. ప్రజా ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్ద పీట వేస్తుందన్నారు. రవాణా సౌకర్యం లేక పేద విద్యార్దులు చదువు మానేయవద్దనే ఉద్దేశంతో పి ఎస్ ఆర్ పి ఎస్ ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ ప్రతి సంవత్సరం హైస్కూలు నుంచి జూనియర్ కాలేజీ వరకు విద్యార్ధులకు సైకిళ్లు పంపిణీ చేస్తున్నామన్నారు.

గత ప్రభుత్వం కోళ్ల ఫారాలలో, మూత బడ్డ రైస్ మిల్లులలో రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్వహించారని ఆరోపించారు. ఈ ప్రభుత్వం పేద విద్యార్ధుల(Students) కోసం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రూ. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ (Integrated School) లను నిర్మిస్తోందని వివరించారు. పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయిపాలెంలో రూ.46 కోట్లతో ఎటీసి(ఐటీఐ) ని త్వరలోనే ప్రారంభిస్తామని వెల్లడించారు. ఏదులాపురం మున్సిపాల్టీలో రూ.208 కోట్లతో జెఎన్

టీయు కాలేజీ నిర్మాణం జరుగుతోందన్నారు.
అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే మెగా డీఎస్సీ ద్వారా 11 వేల టీచర్ ఉద్యోగాలు(Teacher jobs)భర్తీ చేశామని చెప్పారు. చాలా ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు చేపట్టామన్నారు. ప్రతి విద్యార్ధిలో ఒక నైపుణ్యం ఉంటుందని, వారిలో దాగి వున్న నైపుణ్యాన్నిపెంపొందించేందుకు ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసిందని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఎంతో కష్టపడి చదివిస్తున్నారు. విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రుల కలలు నెరవేర్చాలని సూచించారు.

 Also Read: Mulugu District: హిడ్మా తప్పించుకున్నాడా? కర్రెగుట్టల వద్ద మళ్లీ కూంబింగ్

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?