Mulugu District: భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు ఉదయం నుంచి కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఆపరేషన్ కగార్ (Operation Kagar) చేపట్టిన నాటి నుంచి కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులపై ఉక్కు పాదం మోపుతూ వస్తోంది. ఆ నేపథ్యంలోనే అటు ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాష్ట్రం ఇటు తెలంగాణ రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో భద్రతాబలగాలు ఎప్పటికప్పుడు విస్తృత తనిఖీలు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలోనే మణుగూరు, పినపాక, కరకగూడెం, అశ్వాపురం, బూర్గంపాడు, ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
మావోయిస్టుల సమాచారం కోసం ఆడుగడుగునా సమాచారాన్ని సేకరిస్తూ కూంబింగ్ లను కొనసాగిస్తున్నారు. మణుగూరు, పినపాక, కరకగూడెం, అశ్వాపురం, బూర్గంపాడు, ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలాల్లో గిరిజన గ్రామాలను జల్లెడ పడుతున్నారు. మావోయిస్టుల ఆచూకీ లభ్యమైతే అదుపులోకి తీసుకోవడం అవసరమైతే ఎదురు కాల్పులు జరపడమా…? అనే కోణంలో కూంబింగ్ లను విస్తృతం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆపరేషన్ కగార్ లో భాగంగా తెలంగాణ… ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) సరిహద్దు ప్రాంతంలోని వెంకటాపురం మండలం కర్రెగుట్టల వద్ద దాదాపు 22 రోజులపాటు మావోయిస్టుల కోసం కేంద్ర భద్రతా బలగాలు, చత్తీస్గడ్ రాష్ట్ర రిజర్వు గాడ్స్, సీఆర్పీఎఫ్, బస్తర్ ఫైటర్స్ లతో విస్తృతంగా కూంబింగ్లు, సోదాలు, తనిఖీలు చేపట్టారు.
Also Read: Falcon Scam: రూ. 4,215 కోట్ల భారీ మోసం వెలుగులోకి!
ఈ కార్యక్రమాల్లో మావోయిస్టులు దాదాపు 32 మంది వరకు వివిధ కేడర్లలో ఉన్న భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదుర్కాల్పుల్లో మృతి చెందారు. భద్రతా బలగాలు కర్రెగుట్టల ప్రాంతానికి చేరుకున్న రెండో రోజునే మోస్ట్ వాంటెడ్ హిడ్మా సహా మావోయిస్టు ముఖ్య నేతలు అక్కడి నుంచి తప్పించుకున్నట్లుగా ప్రచారం జరిగింది. ప్రచారం జరిగిన విధంగానేమావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు, మోస్ట్ వాంటెడ్ మావోయిస్టులు సైతం తప్పించుకొని ఒడిస్సా.. ఆంధ్ర, మహారాష్ట్ర… ఆంధ్ర, ఒరిస్సా… మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాలకు వెళ్లి తప్పించుకున్నట్లుగా కూడా ప్రచారం సాగింది. మొత్తానికి మళ్లీ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్, బీజాపూర్, దంతేవాడ జిల్లాలకు మావోయిస్టులు చేరినట్లుగా తెలుసుకున్న భద్రతా బలగాలు ఆ ప్రాంతాలన్నింటినీ ఇప్పటికీ కూంబింగ్లతో జల్లెడ పడుతున్నారు. దాదాపు నాలుగు ఐదు చోట్ల ఎన్కౌంటర్లు సైతం జరిగాయి. ఎన్కౌంటర్లలో ఇద్దరు భద్రతా బలగాలు, దాదాపు 15 నుంచి 20 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా అధికారికంగా అధికారులు వెల్లడించారు.
వర్షాల నేపథ్యంలో…
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్, బీజాపూర్, దంతేవాడ జిల్లాల్లో మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు, ఛత్తీస్‌గఢ్ డి ఆర్ జి బలగాలు విస్తృతంగా తనిఖీలను చేపడుతున్నాయి. ప్రతి ఏజెన్సీ ప్రాంతంలోని పల్లెలను, అటవీ ప్రాంతాలను వదలకుండా కూంబింగ్ నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్షాకాలం ప్రారంభం కావడంతో అక్కడి నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు, పినపాక, కరకగూడెం, అశ్వాపురం, బూర్గంపాడు, ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టులు ఉన్నారనే అనుమానంతో కూంబింగ్లను విస్తృతం చేస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలో మావోయిస్టులకు సేపు జోన్లుగా ఉన్న ప్రాంతాల్లో సంచరిస్తున్నారా…? అనే కోణంలోనూ పోలీసులు విస్తృతంగా సోదాలను చేస్తున్నారు.
మరోవైపు మంత్రుల పర్యటన నేపథ్యంలో…
వెంకటాపురం, వాజేడు, కన్నాయిగూడెం, మంగపేట మండలం లలో మల్టీ నేషనల్ మొక్కజొన్న క్రాస్ బ్రీడ్ విత్తన కంపెనీల ద్వారా నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పించేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి సీతక్క, రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, సీడ్ కార్పోరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, అటవీశాఖ కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలోనూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పూర్తి బందోబస్తు చర్యలను చేపడుతున్నట్లుగా కూడా తెలుస్తోంది.
Also Read: Phone Tapping: షాద్ నగర్ చుట్టూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం!