DGP Jitender( IMAGE credit: swetcha reporter)
హైదరాబాద్

DGP Jitender: ఆర్థిక నేరాలపై దృష్టి పెట్టండి.. డీజీపీ కీలక సూచనలు

DGP Jitender: ఆర్థిక వ్యవస్థీకృత నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని డీజీపీ జితేందర్(DGP Jitender) సూచించారు. విజబుల్ పోలీసింగ్ ను పెంచాలని చెప్పారు. మహిళలు, చిన్న పిల్లల భద్రత కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ యేడాది మొదటి ఆరునెలల్లో జరిగిన నేరాలపై డీజీపీ కార్యాలయంలో  ఆయన సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీసు సిబ్బంది జవాబుదారీతనంతో పారదర్శకంగా పని చేయాలని చెప్పారు. డేటా డ్రివెన్ పోలీసింగ్ ద్వారా నేరాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.

Also Read: Medchal Crime: హత్యకు దారి తీసిన అప్పు వివాదం.. కత్తులతో దారుణం

భద్రత కోసమే పని చేయాలి  

ఆయా కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా పకడ్భంధీగా దర్యాప్తు చేయాలన్నారు. పోలీస్ స్టేషన్లను ప్రజలు ప్రథమ న్యాయస్థానాలుగా భావిస్తారని చెబుతూ నిత్యం వారి భద్రత కోసమే పని చేయాలని చెప్పారు. తొలి ఆరునెలల్లో నేరాల నియంత్రణకు సిబ్బంది చేసిన కృషిని అభినందించిన డీజీపీ జితేందర్ దీనిని కొనసాగించాలన్నారు. తెలంగాణ సైబర్​ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్​ సైబర్ నేరాలపై ప్రజంటేషన్ ఇచ్చారు. సీఐడీ అదనపు డీజీపీ చారు సిన్హా నేతృత్వంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో అదనపు డీజీపీ (శాంతిభద్రతలు) మహేశ్ భగవత్, అదనపు డీజీ (పర్సనల్​) అనిల్ కుమార్, ఐజీ (పీఅండ్ఎల్​) ఎం.రమేశ్​, మల్టీజోన్​ ఐజీలు చంద్రశేఖర్ రెడ్డి, తఫ్సీర్​ ఇక్భాల్​, సైబరాబాద్ కమిషనర్​ అవినాష్ మహంతి, రాచకొండ కమిషనర్​ సుధీర్ బాబుతోపాటు వేర్వేరు కమిషనరేట్ల కమిషనర్లు, జిల్లాల ఎస్పీలు పాల్గొన్నారు.

 Also Read: Medak ST Hostel: ఎస్టీ హాస్టల్‌లో ఏసీబీ అధికారుల ఆకస్మిక తనిఖీలు

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?