Mihailo Tolotos: ఈ ప్రపంచంలో మనకీ తెలియని ఎన్నో వింత నిజాలు ఉన్నాయి. వాటిని మనం విన్నపుడు ఇలా కూడా ఉన్నాయా ? ఇలా కూడా జరుగుతాయా? ఇలాంటి వాళ్ళు కూడా భూమి మీద ఉన్నారా అని షాక్ అవ్వకుండా ఉండలేము. సాధారణంగా అబ్బాయిలు , అమ్మాయిలను చూడకుండా, వారితో మాట్లాడకుండా ఉండలేరు. కానీ, ఇప్పుడు చెప్పుకునే వ్యక్తి అతని నిజ నిజ జీవితంలో ఆడ వాళ్ళు ఎలా ఉంటారో కూడా తెలియదట.
Also Read: Lord Brahma: కలి యుగమే అతి భయంకరమైనదా? బ్రహ్మదేవుడు, నారదుడితో చెప్పిన నిజాలు త్వరలో జరగబోతున్నాయా?
అతనికి ఆడ వాళ్ళు ఎలా ఉంటారో కూడా తెలియదా?
ఈ ప్రపంచంలో ఆడవాళ్ళని చూడని ఒక వ్యక్తి ఉన్నారని తెలుసు. అతను ఇంత వరకు అమ్మాయిని ఒక్క సారి కూడా చూడలేదు. అసలు అతనికి వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు. అతను పెరగడం కూడా అలాగే పెరిగాడు. తన 82 ఏళ్ళలో ఒక్కసారి కూడా అమ్మాయి మొహాన్ని చూడలేదు. అలా అని అతను గుడ్డి వాడు కాదు. ఆరోగ్యంగానే ఉన్నాడు.
Also Read: Reel vs Reality: మనం చూసేవన్ని నిజాలు కావు.. ఈ భూమి మీద వేటిని కూడా టచ్ చెయ్యట్లేదని మీకు తెలుసా?
గ్రీస్ లో పుట్టిన ఇతని పేరు మిహైలో టోలోటోస్. అతను పుట్టిన వెంటనే వారి అమ్మ చనిపోయింది. అప్పటికే తన వయస్సు 4 గంటలు మాత్రమే. ఎవరూ కూడా అతన్ని పట్టించుకోలేదు. అలాగే, ఇతని తండ్రి కోసం వెతికినా ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఇంక ఒక సాధువు అతన్ని దగ్గరకు తీసుకుని గ్రీస్ లో ఉన్న ఒక పర్వతం పైకి వెళ్ళాడు. అయితే, ఆ పర్వతం పైకి ఆడ వాళ్ళకి అనుమతి లేదు. ఇప్పటికి కూడా 82 ఏళ్ళ సంవత్సరంలో ఆడ వాళ్ళని చూడకుండా ఉన్నాడు. ఆయన జీవితం మొత్తం పర్వతం పైనే గడిచి పోయింది.
