Lord Brahma: మన హిందూ గ్రంథ ధర్మాలలో నాలుగు యుగాల గురించి, వాటి యొక్క కాల వ్యవధుల గురించి, ఏ యుగంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో వివరంగా చెప్పారు. సత్య యుగం పూర్తైన తర్వాత, త్రేతా యుగం ప్రారంభమైతుంది, ఆ తర్వాత ద్వాపర యుగం ఆ తర్వాత కలి యుగం ప్రారంభమౌతాయి.
సత్య యుగం యొక్క కాల వ్యవథి 17 లక్షల 28,000 సంవత్సరాలు. త్రేతా యుగం యొక్క కాల వ్యవథి 12 లక్షల 96,000 సంవత్సరాలు. ద్వాపర యుగం 8 లక్షల 64,000 సంవత్సరాలు. కలి యుగం యొక్క కాల వ్యవధి 4,32,000 సంవత్సరాలు. ఒక యుగం పూర్తైన తర్వాత మరొక కొత్త యుగం ప్రారంభమవుతుంది. ఈ యుగాలన్నీ పూర్తైన తర్వాతే కాల చక్రం పూర్తవుతుంది. అయితే, అన్నీ యుగాలలో కలి యుగమే అతి భయంకరమైనదా? ఆ రోజు బ్రహ్మదేవుడు, నారదుడితో ఏం చెప్పాడో ఇక్కడ తెలుసుకుందాం..
భవిష్య పురాణంలో బ్రహ్మ దేవుడు, నారదుడితో ముఖ్యమైన విషయాల గురించి చెప్పాడు. దేవర్షి నారదా భయంకరమైన కలి యుగం త్వరలో రాబోతోంది. ఈ సమయంలో మనుషుల ఆలోచన విధానం మొత్తం మారిపోతుంది. మంచి వాళ్ళు కూడా చెడ్డ వాళ్ళ లాగా మారిపోతారు. వాళ్ళు తమ సొంత కుటుంబ సభ్యులతోనే శత్రుత్వం పెంచుకుంటారు. అలాగే, బ్రాహ్మణులు, క్షత్రియులు పాపాలు చేస్తూనే ఉంటారు. ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటుందో వాళ్ళే సంతోషంగా ఉంటారు. పేద ప్రజలు ఆకలితో అలమటిస్తారు. చాలా మంది వారి ధర్మాలను విడిచి పెట్టి ఇతర ధర్మాలను స్వీకరిస్తారు. దేవతలు తమ దైవత్వాన్ని కోల్పోతారు. భక్తులకు దేవతలు ఆశీర్వాదాలు ఇచ్చినా ఫలితం లేకుండా పోతుంది. దీంతో, వాళ్ళు దేవుళ్లను పూజించడం కూడా ఆపేస్తారు.
పవిత్రమైన వివాహ బంధం దాని పవిత్రతను కోల్పోతుంది. చాలా మంది వివాహం చేసుకున్న తర్వాత విడాకులు తీసుకుంటారు. ఆ తర్వాత మరో పెళ్లి చేసుకుంటారు. ఇంకో వైపు పిల్లలు తల్లి దండ్రులు మాట వినకుండా పోతారు. వృద్దాప్యాయంలో వాళ్ళని కూడా చాలా కష్ట పెడతారు. అలాగే, ఈ సమయంలో బాల్య వివాహాలు పెరిగిపోతాయి. ప్రతి ఒక్కరూ 11, 15 ఏళ్ళ వయస్సులోనే పెళ్లి చేసుకుంటారు. వివాహం జరిగిన ఏడాదిలోనే పిల్లలను కంటారు. చిన్న వయస్సులో పెళ్లి చేసుకోవడం వలన వివాహిత మహిళలు అనేక ఆరోగ్య సమస్యలతో బాధ పడతారు. అలాగే పుట్టిన పిల్లలు కూడా ఎక్కువ కాలం బతకరని బ్రహ్మ దేవుడు, దేవర్షి నారదతో చెప్పాడు. వీటిలో చాలా వరకు జరిగాయి. ముందు ముందు వారి జీవిత కాలం చాలా వరకు తగ్గి పోతుందని అంటున్నారు. ఇంకొందరు ఇన్ని జరిగాయి అంటే మిగతావి కూడా జరగకుండా ఉంటాయా? తప్పక జరుగుతాయని చెబుతున్నారు.
