Viral Video: సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోతుంది. ఏ చిన్న ఘటన జరిగిన అది వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నారు. అది క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇలా రోజూ కొన్ని వేల వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. అయితే, తాజాగా ఢిల్లీలో జరిగిన ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఢిల్లోలోని ఆజాద్ పూర్ రైల్వే స్టేషన్ వద్ద ఉన్న ఒక రైల్వే ఫ్లాట్‌ఫామ్ పైనే స్థానికులు అక్రమంగా ఇళ్లు కట్టుకుని మార్చేసిన ఘటన బయటకు వచ్చింది. ఈ వీడియోలో రైల్వే ట్రాక్ పక్కనే కాకుండా ఏకంగా ఫ్లాట్‌ఫామ్‌పైనే పక్క పక్కన ఇళ్లను నిర్మించిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు షాక్ అయ్యారు. అసలు రైల్వే ప్రాపర్టీపై పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు జరగడం ఎలా సాధ్యమైందని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనతో రాజధానిలో పబ్లిక్ ప్రాపర్టీపై అక్రమ నిర్మాణాలు పెరుగుతున్నాయని తెలుస్తోంది. ప్రజా స్థలాలు ఇలా వ్యక్తిగత ఉపయోగానికి మారిపోవడం ఆందోళన కలిగిస్తోంది.
ఇక వీడియో వైరల్ అయిన తర్వాత నెటిజన్లు రైల్వే అధికారులను ప్రశ్నలు అడుగుతున్నారు. “ రైల్వే ఫ్లాట్‌ఫామ్‌పై ఇళ్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఎలా ఇచ్చారు?”, “ ఇంత పెద్ద స్థాయిలో నిర్మాణాలు జరుగుతున్నా కూడా అధికారులు ఎందుకు పట్టించుకోలేదు? అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఈ ఘటనపై రైల్వే శాఖ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే, సోషల్ మీడియాలో పెరుగుతున్న చర్చల కారణంగా అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Is @RailMinIndia sleeping?
📍 Azadpur Railway Station pic.twitter.com/OD5wL0KYkS
— Kreately.in (@KreatelyMedia) November 3, 2025
