Viral Video: ఈ మధ్య కాలంలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్నాయి. చాలా మంది లే ఆఫ్స్ వలన తమ ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో, వారికీ వచ్చిన పనిని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అలా ఓ వ్యక్తి తన ఉద్యోగం వదిలి డ్రైవర్ గా చేస్తున్నాడు. ఆయన సోషల్ మీడియాలో పెట్టిన వీడియో తెగ వైరల్ అవుతుంది.
బెంగళూరులో రాకేష్ అనే వ్యక్తి, కార్పొరేట్ ఉద్యోగం వదిలి ఆటో రిక్షా డ్రైవర్‌గా మారిన అనుభవాన్ని సోషల్ మీడియా లో షేర్ చేశాడు. Rakesh Auto Driver అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ అయిన వీడియో, దేశవ్యాప్తంగా వైరల్ అవుతుంది. జీవితం, డబ్బు గురించి అతని మాట్లాడిన నిజమైన మాటలు చాలా మందికి ప్రేరణగా మారాయి.
భయాన్ని మానేసి కొత్త జీవితం ప్రారంభించండి..
వీడియోలో రాకేష్ ఇలా చెబుతున్నాడు, “ నా జీవితంలో ఒక సమయంలో పూర్తిగా గందరగోళంలో, భయంతో ఉన్నాను. జీవితమే పూర్తిగా పోయిందని అనుకున్నప్పుడు మళ్లీ తిరిగి లేవలేనేమో అని భయ పడ్డాను. ఆ సమయంలో ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. కానీ ఇప్పుడు ఆటో డ్రైవ్ చేస్తూ, కొత్తదాన్ని ప్రయత్నించడంలో భయం మొత్తం పోయిందని చెబుతున్నాడు. మీరు కూడా అలాగే “జీవితం ముగిసిపోతుందని భావించే వారు, ఏం చేయాలో తెలియని వారు, ఇది మీకోసమే. ఏదైనా ఎదురైతే, నేను ఎదుర్కొంటాను అని మీకు మీరే అనుకుని ముందుకు వెళ్ళాలి ” అని రాకేష్ తెలిపాడు.
అతను చెప్పిన విధంగా, సామాజిక అంచనాలను వదిలేసి కొత్త మార్గంలో అడుగుపెట్టడం, అతనికి సంతృప్తికరమైన పని, వ్యక్తిగత వృద్ధి పై దృష్టి పెట్టడానికి సహాయపడింది. “ జాగ్రత్తగా జీవించండి, ఏదొక పని చేయడంలో ఫోకస్ పెట్టండి. డబ్బు ముఖ్యమే, కానీ అది ఒక్కటే మాత్రమే కాదు. జీవితానికి విలువ కనిపెట్టండి, నిజమైన లక్ష్యాన్ని కనుగొనండి” అని రాకేష్ చెప్పాడు.
సోషల్ మీడియా రెస్పాన్స్
ప్రస్తుతం, ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. దీనిని చూసిన వారు వందల మంది యూజర్లు రాకేష్ ని ప్రశంసించారు. చాలామంది సామాజిక అగౌరవం, అహంకారం దాటేసి ధైర్యంగా మారిన తీరు కోసం బాగా ప్రశంసించారు. కొందరు తమ అనుభవాలు కూడా పంచుకున్నారు, “నేను HR & Marketing లో MBA, ఇప్పుడు డ్రైవర్. మీ కథ నన్ను deeply resonate చేసింది,” అని చెప్పినవారు కూడా ఉన్నారు.
“రాకేష్ కేవలం తన కెరీర్ ను మాత్రమే మార్చలేదు, ధైర్యం చూపడం, తనను తెలుసుకోవడం, విజయం అంటే ఏమిటో చూపించాడు. అతని ఈ ప్రయాణం, సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో, చాలా మందికి జీవితంలో కొత్త మార్గాలు, పాఠాలు నేర్పుతోంది.”
