Chamal Kiran Kumar Reddy: ట్రిపుల్ ఆర్, మూసీ రీజువెనేషన్ కు కేంద్రం సహకరించాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamal Kiran Kumar Reddy) పేర్కొన్నారు. మాట్లాడుతూ…పార్లమెంట్ సమావేశాల్లో రీజినల్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రైల్, మూసీ రీజువెనేషన్, పట్టణ స్థానిక సంస్థలకు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ వంటి వాటిపై ప్రశ్నిస్తామన్నారు.
Also Read: Chamala Kiran Kumar Reddy: మీకు ఇరిగేషన్ ప్రాజెక్టులపై అవగాహన లేదు: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
విమానాశ్రయ అనుమతులు, ఆర్ధిక సమస్యల పరిష్కారం
దీంతో పాటు కొత్త రైల్వే మార్గాల ఆమోదాలు, వరంగల్, కొతగూడెం, పెదపల్లి విమానాశ్రయ అనుమతులు, ఆర్ధిక సమస్యల పరిష్కారం వంటివాటిపై డిస్కషన్ చేస్తామన్నారు. దీంతో పాటు ఈసీ నిర్లక్ష్యం, నిరుద్యోగం, ఢిల్లీ లో కాలుష్యం, నేషనల్ హెరాల్డ్ కేసు వంటి వాటిపై ప్రశ్నలు లేవనెత్తుతామన్నారు. ఇక విదేశాంగ విషయాల్లో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, ఇండియా, పాకిస్థాన్ మధ్యవర్తిత్వాలు, ట్రెడ్ అంశాలపై కేంద్రం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నదన్నారు.
Also Read: Chamala Kiran Kumar Reddy: నవీన్ యాదవ్ ర్యాలీ చూసి బీఆర్ఎస్ కు దడ.. ఎంపీ చామల కీలక వ్యాఖ్యలు
