Chamala Kiran Kumar Reddy: కంటోన్మెంట్ రిజల్ట్ జూబ్లీహిల్స్ లోనూ రిపీట్ కానున్నదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన గాంధీభవన్ లో మాట్లాడుతూ…ఓడిపోతామని తెలిసి, బీఆర్ ఎస్ దొంగ డ్రామాలు మొదలు పెట్టిందన్నారు. అచ్చోసిన ఆంబోతుల వలే ఇద్దరు నాయకులు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సంచరిస్తున్నారని విమర్శించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ ఎస్ డిపాజిట్ గల్లంతు అవుతుందనే భయం తో గల్లీ గల్లీ తిరుగుతున్నారన్నారు.
Also Read: Chamala Kiran Kumar Reddy: ఇంట్లో ఈటెల రాజేందర్ రెడ్డి.. గేట్ బయట ఓబీసీ నాయకుడు!
జూబ్లీహిల్స్ లో బీఆర్ ఎస్ నాయకులకు ఏం పని?
బీఆర్ఎస్ పరిస్థితి కంటోన్మెంట్ ఎన్నికల్లో మూడో స్థానం ఉండగా, పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా వచ్చిందన్నారు. 2023 ఎన్నికల్లో ప్రజలు తన్ని ఫామ్ హౌజ్ కి పరిమితం చేశారన్నారు. 10 ఏళ్ళు దరిద్రపు పాలన చేసి, నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ప్రజల కోసం ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ పక్షాన నిలబడి మాట్లాడలేదన్నారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో బీఆర్ ఎస్ నాయకులకు ఏం పని? అంటూ ఫైర్ అయ్యారు. నవీన్ యాదవ్ నామినేషన్ ర్యాలీ చూసి బీఆర్ ఎస్ లో దడ పుట్టిందన్నారు. అసలైన దండు పాళ్యం బ్యాచ్ కేసీఆర్ ఫ్యామిలేనని వెల్లడించారు. విష్ణు వర్ధన్ తో నామినేషన్ ఎందుకు వేశారో ? బీఆర్ ఎస్ స్పష్టంగా తేల్చాలన్నారు. ఈకార్యక్రమంలో స్పోక్స్ పర్సన్ డాక్టర్ లింగం యాదవ్, భాస్కర్ తదితరులు ఉన్నారు.
Also Read: Chamala Kiran Kumar Reddy: కేటీఆర్ బయటకు రావడం ఆనందమే.. ఎంపీ చామల
