Chamala Kiran Kumar Reddy: మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇంట్లో రెడ్డి సామాజిక వర్గంగా వ్యవహారిస్తూ, గేట్ బయటకు రాగానే ఓబీసీ నాయకుడిగా కన్వర్ట్ అవుతాడని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఆయన గాంధీభవన్ లో మాట్లాడుతూ..బీజేపీ అధ్యక్ష పదవి కోసం ఈటల రాజేందర్ తహతహ లాడుతున్నారన్నారు. అందుకే సీఎం, కాంగ్రెస్ పై విమర్శలు చేస్తూ మార్కుల పొందేందుకు ప్రయత్నిస్తున్నాడని పేర్కొన్నారు.
బీఆర్ ఎస్ వదిలి చాలా రోజులైనా, డైలీ బీఆర్ ఎస్ ఫేవర్ గా మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణలో కన్ఫ్యూజన్ పొలిటీషియన్ ఈటల రాజేందర్ అని వివరించారు. లెప్ట్ వింగ్ నేపథ్యం నుంచి రైట్ వింగ్ కు వెళ్లి అధ్యక్ష పదవి కోసం పాకులాడుతున్నారన్నారు. పదవి రాలేదని ప్రస్టేషన్ ఆయనలో ఉన్నదన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇచ్చిందనే విషయాన్ని హరీష్ రావు గుర్తు పెట్టుకోవాలని సూచించారు.
Also Read: Etala Rajender: హరీష్ రావును నేనెందుకు కలుస్తా.. ఈటల సంచలన కామెంట్స్!
ఇక రేవంత్ రెడ్డి సన్నిహిత ఎంపీ,కార్పొరేషన్ చైర్మన్ లు ఇంగ్లాండ్ మిస్ మ్యాగీ ని ఇబ్బంది పెట్టారనే విషయంలో వాస్తవం లేదన్నారు. బీఆర్ ఎస్ నాయకుడు హరీష్ రావు దాన్ని కావాలనే కాంట్రవర్సీ చేస్తున్నారన్నారు. దమ్ముంటే వీడియో పుటేజ్ లు బయట పెట్టాలని కోరారు. ప్రభుత్వాన్ని బద్నం చేసేందుకు ఆమెతో అలా మాట్లాడించారేమోననే అనుమానం కూడా ఉన్నదన్నారు. అధికారాన్ని ఎలా దుర్వినియోగం చేయాలనేది బీఆర్ ఎస్ కు స్పష్టంగా తెలుసునని వివరించారు. కేసీఆర్ ఇక ముఖ్యమంత్రి కావడమనేది కలగానే మిగులుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్పోక్స్ పర్సన్ చరణ్ కౌశిక్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: Kodanda Reddy: సత్వర చర్యలు తీసుకోవాలని.. అధికారులకు కోదండరెడ్డి ఆదేశం!