Etala Rajender: బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావును తానెందుకు కలుస్తానని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాయలంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హరీశ్ ను పెళ్లిళ్లు, చావుల వద్ద కలిసిందే తప్పా వేరే ఎక్కడా కలవలేదని ఆయన స్పష్టంచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ విచారణకు తాను హాజరవుతానని ఈటల వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ విచారణ ఎక్కడికి పోయిందని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ అవినీతి, అక్రమాలపైన కనీసం చర్యలు తీసుకున్నారా? అని రాజేందర్ ప్రశ్నించారు. గతంలో వేసిన విచారణ కమిషన్ ఇచ్చిన నివేదికలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read: Jagga Reddy: పదేళ్లు ఎంపీగా ఏం చేశావ్..? జగ్గారెడ్డి సంచలన కామెంట్స్!
తొలిదశ తెలంగాణ ఉద్యమంలో 360 మందిని కాంగ్రెస్ బలితీసుకుందని, కాంగ్రెస్ కు తెలంగాణ ఇచ్చే గుణం ఉంటే ఆనాడే ఇవ్వాల్సిందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరిట చేపట్టిన మలిదశ ఉద్యమంలో అనేక మంది యువత బలిదానాలు చేసుకున్నారన్నారు. ఆ త్యాగాలకు నేడు విలువ లేకుండా చేశారని ఈటల విమర్శలు చేశారు. కేసీఆర్ తొమ్మిదిన్నరేండ్లు నిరంకుశ పాలన సాగించారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా అమరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని నిలదీశారు. బీఆర్ఎస్ పేరు చెప్పి కాంగ్రెస్ తప్పించుకుందని, తెలంగాణ కంటే ఏపీ జీడీపీ, ఆదాయం తక్కువ ఉన్న రాష్ట్రమని.. అయినా అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతోందన్నారు. తెలంగాణ మాత్రం వెలవెలబోతోందని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలను బీఆర్ఎస్, కాంగ్రెస్ కల్లలు చేసిందని ఫైరయ్యారు.
Also Read: Harish Rao: బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తే.. రెడ్ బుక్ లో పేర్లు నమోదు!