China Floods: చైనాను వరదలు ముంచెత్తాయి. వర్షాలకు తోడు వరదలు పొటెత్తడంతో నదులు ఉప్పొంగాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఈ వరదల థాటికి ఆరుగురు దుర్మరణం చెందగా, పలువురు గల్లంతయ్యారు. ముఖ్యంగా.. చైనాలోని గుయ్ జౌ ప్రావిన్సులో భారీ వర్షాలతో వరదలు పోటెత్తడంతో అతలాకుతలమైంది. వేలాది మంది తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. దాదాపు 3లక్షల మంది నిర్వాసితులయ్యారు. ముఖ్యంగా.. ఈ ప్రభావం డంజాయ్, రోంగ్ జియాంగ్, లెయ్ షాన్, కైలీ ప్రాంతాల్లో అధికంగా ఉన్నది. నదులు ఉప్పొంగడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి పెద్ద ఎత్తున వరదనీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. మరోవైపు పలు ప్రాంతాల్లో వంతెనలు, రోడ్లు, పెద్ద పెద్ద భవనాలు దెబ్బతిన్నాయి. ఇక పంటపొలాలు అయితే పూర్తిగా నీటమునిగాయి. విపత్తు నిర్వహణ బృందాలు సహాయక చర్యలు అక్కడక్కడా కొనసాగుతున్నాయి. మొత్తమ్మీద చూస్తే చైనాలో ఆందోళనకర పరిస్థితులే నెలకొన్నాయి. కాగా, వారం రోజుల్లోనే రెండుసార్లు భారీగా వరద నీరు రావడంతో అక్కడి జనాలు తేరుకోలేకపోతున్నారు.
Read Also- Bigg Boss Telugu 9: రిటర్న్ గిఫ్ట్ రెడీ చేసిన నాగార్జున.. ఇక మీదే ఆలస్యం!
ఔరా.. డ్రోన్!
వరదల్లో చిక్కుకున్న వ్యక్తిని డ్రోన్ కాపాడింది. వరదలు చుట్టుముట్టడంతో గువాంగ్షీ ఏరియాలో బిల్డింగ్ టెర్రస్ మీద నిలబడిన వ్యక్తిని డ్రోన్ పసిగట్టి సురక్షిత ప్రాంతానికి చేర్చింది. దీంతో డ్రోన్ గురించి ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు. పైనున్న భగవంతుడే డ్రోన్ రూపంలో వచ్చి కాపాడినట్లుగా నెటిజన్లు చెప్పుకుంటున్నారు. వాస్తవానికి జూన్, జూలై నెలల్లో భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు ప్రభావితం అవుతుంటాయి. 2024లో యాంగ్జీ నది మొదటిసారిగా పొంగి పొర్లింది. కొన్ని ప్రాంతాల్లో గత 25 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా వరదలు వచ్చాయి. అసాధారణంగా త్వరగా ప్రారంభమైన భారీ వర్షాకాలం దక్షిణ చైనాను తీవ్రంగా ప్రభావితం చేసింది. గ్వాంగ్‌డాంగ్, అన్‌హుయ్, హునాన్, జియాంగ్సు, గుయిజౌ, జియాంగ్సీ ప్రావిన్సులు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. గన్సు ప్రావిన్స్, నింగ్జియా అటానమస్ రీజియన్‌లోని కొన్ని ప్రాంతాలు కూడా వరదల బారిన పడ్డాయి. చోంగ్‌కింగ్, పింగ్‌జియాంగ్ వంటి నగరాల్లో కూడా భారీ నష్టం సంభవించింది. 2024 నాటికి 71 మందికి పైగా మరణించారు, మరికొందరు గల్లంతయ్యారు.
Read Also- Thammudu: నలుగురు హీరోయిన్స్ తో తమ్ముడు డైరెక్టర్ రచ్చ.. మహేష్ బాబును బాగా వాడేశారుగా?
అప్పుడు.. ఇప్పుడూ!
2023లోనూ ఇదే పరిస్థితి. బీజింగ్, పరిసర ప్రాంతాల్లో సంభవించిన వరదల్లో 20 మందికి పైగా మరణించారు. వరదల కారణంగా పంటలు దెబ్బతిన్నాయి, రోడ్లు కొట్టుకుపోయాయి, ఇళ్లు ధ్వంసమయ్యాయి. లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 2024 వరదల వల్ల సుమారు 5.05 బిలియన్ యువాన్ల (సుమారు 695 మిలియన్ డాలర్లు) ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా. చైనా ప్రభుత్వం, సైన్యం మరియు వివిధ సామాజిక సంస్థలు సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొంటున్నాయి. వరద బాధితులకు సహాయ సామగ్రి పంపిణీ, అత్యవసర రెస్క్యూ.. పోస్ట్-డిజాస్టర్ పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపట్టారు. గతంలో చెప్పినట్లుగా, వరద సహాయక చర్యల కోసం డ్రోన్‌లను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. చైనా ప్రతి సంవత్సరం వరదలతో తీవ్రంగా ప్రభావితమవుతోంది. వాతావరణ మార్పులు, పెరిగిన పట్టణీకరణ ఈ వరదలకు ప్రధాన కారణాలని నిపుణులు భావిస్తున్నారు.
Read Also- Anchor Swetcha: స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్.. నమ్మలేని నిజాలు
