Swetcha Purna
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Anchor Swetcha: స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్.. నమ్మలేని నిజాలు

Anchor Swetcha: మీడియా రంగంలో పెను సంచలనం సృష్టించిన న్యూస్ ప్రజెంటర్ స్వేచ్ఛ వొటార్కర్ (Swetcha Votarkar) ఆత్మహత్య కేసులో రోజుకో సంచలన విషయం వెలుగు చూస్తున్నది. ఇప్పటి వరకూ అందరికీ వచ్చిన అనుమానాలే అక్షరాలా నిజమయ్యాయి. స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్నది తన ప్రియుడు, పెళ్లి చేసుకొని కడదాకా బతకాలనుకున్న పూర్ణచందర్ నాయక్ (Purna Chandar Naik) వల్లనే అని తేలిపోయింది. శనివారం రాత్రి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో పూర్ణ లొంగిపోగా.. అతనిపై బీఎన్ఎస్ యాక్ట్ 69, 108 యాక్ట్‌తో పాటు ఫొక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లుగా చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమార్ వెల్లడించారు. అయితే పోలీసు విచారణలో భాగంగా నమ్మలేని నిజాలు వెలుగుచూశాయి. మరోవైపు స్వేచ్ఛ కుమార్తె సైతం కొన్ని షాకింగ్ విషయాలను స్వేచ్ఛ-బిగ్ టీవీతో పంచుకున్నారు. నిజంగా ఈ విషయాలన్నీ విన్న తర్వాత అసలు సభ్య సమాజంలో ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా? ఈ భూమ్మీద బతకడానికి పూర్ణ అర్హుడేనా? అనే ప్రశ్నలు అందరిలోనూ వస్తాయి.

Swetcha

Read Also- Bhadradri Kothagudem: ఈ జర్నలిస్ట్ నిజంగా దేవుడు.. నేను ఉన్నానంటూ హమీ

అవును.. నేనే..!
స్వేచ్ఛ మృతికి తానే కారణమని పోలీసు విచారణలో పూర్ణ ఒప్పుకున్నాడు. తన వల్లే స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుందని.. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుందని విచారణలో పూసగుచ్చినట్లుగా చెప్పేశాడు. కొంతకాలంగా స్వేచ్ఛతో గొడవలు జరుగుతున్నాయని.. వీటి కారణంగానే మనస్తాపానికి గురై ఇలా జరిగిందని విచారణలో అతను చెప్పేశాడు. దీన్ని బట్టిచూస్తే పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా అసలు నిజాలు బయటికి వచ్చేశాయి. కాగా, పెళ్లి చేసుకుంటానని స్వేచ్ఛను నమ్మబలికాడు. ఆ తర్వాత ఇరువురూ రిలేషన్ సాగించారు. పెళ్లి విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే పూర్ణను బాగా నమ్మింది స్వేచ్ఛ. అయితే చివరికి మోసం చేస్తున్నాడని తెలుసుకుని అతనితో విడిపోదామని నిర్ణయించుకున్నది. ఆఖరికి పెళ్లి విషయంలో చనిపోవడానికి ముందు కూడా స్వేచ్ఛతో పూర్ణ గొడవ పడినట్లుగా తెలుస్తున్నది.

Purna Chandar

ఏసీపీ మాటల్లోనే..
స్వేచ్ఛ మృతికి పూర్ణచంద్రే కారణం. అమ్మాయితో 15 ఏళ్లుగా ఫ్రెండ్ షిప్ ఉన్నది. పెళ్లి చేసుకుందామని ప్రపోజల్ పెట్టి.. ఆ తర్వాత దానికి భిన్నంగా ప్రవర్తించాడు. ప్రామిస్ నిలబెట్టుకోలేకపోయాడు. దీంతోనే స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుందని మా విచారణలో తేలింది. నిన్న అర్ధరాత్రి పోలీస్ స్టేషన్‌లో సరెండర్ అయ్యాడు. అతని ప్రాథమిక, పరోక్ష సాక్ష్యాలను బట్టి కమిట్ సూసైడ్ అని ప్రూవ్ అయ్యింది. అందుకే ఆయన్ను కోర్టుకు తరలించాం. కేసు ప్రాథమిక విచారణలో ఉంది కాబట్టి ఇంతకుమించి వివరాలు వెల్లడించడానికి లేదు. స్వేచ్ఛ మొబైల్ తీసుకున్నాం. విచారణలో భాగంగా ఎఫ్ఎస్ఎల్‌కు పంపుతాం అని ఏసీపీ రమేష్ కుమార్ మీడియాకు వెల్లడించారు. మరోవైపు పూర్ణచంద్ర మాత్రం తాను అమాయకుడినని.. తనకేమీ తెలియదన్నట్లుగా ప్రవర్తించాడు. అంతేకాదు తాను చెప్పా్ల్సినదంతా లెటర్‌లో చెప్పేశానని, ఇంతకుమించి తన దగ్గర చెప్పడానికి ఏమీ లేదని ఎంతో ధీమాతో సమాధానం చెబుతున్నాడు.

Read Also- Swetcha: యాంకర్ స్వేచ్ఛ చివరిసారిగా కూతురితో ఏం చెప్పింది..? ఎక్స్‌క్లూజివ్

Swetcha Daughter

బ్యాడ్ టచ్ చేసేవాడు!
పూర్ణ చందర్ గురించి స్వేచ్ఛ కుమార్తె చెప్పిన మాటలు ఇప్పుడు చూద్దాం. నాకు నాలుగేళ్లుగా పూర్ణ తెలుసు. అమ్మ ముందు నాపై ప్రేమ ఉన్నట్లుగా నటించేవాడు. నాతో చాలాసార్లు అసభ్యకరంగా ప్రవర్తించే వాడు. ఇవన్నీ అమ్మకు చెబితే నమ్మలేదు. పూర్ణను తండ్రిలా ఫీల్ అవ్వమని చెప్పేది. అమ్మ బాధపడకుండా ఉండాలని ఆయనతో క్లోజ్‌గా ఉన్నాను. నాకు పరీక్షలు ఉన్నాయని చెప్పినా నాతో పనులు చేయించేవాడు. పూర్ణచందర్‌తో మా అమ్మ ఎప్పుడు పెళ్లి చేసుకుంటావ్? ఇలాగే ఇంకెన్ని రోజులు ఉండాలి? అని తరచు గొడవ పడుతూ ఉండేది. మూడేళ్లుగా మా అమ్మను వెంటాడుతూ, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. నాపై కూడా అతడి ప్రవర్తన అసభ్యంగా ఉండేది. కష్టమైన రీతిలో శారీరకంగా హద్దులు దాటి ప్రవర్తించేవాడు. పూర్ణచందర్ ఎప్పుడూ స్వేచ్ఛను తల్లి దగ్గరకు వెళ్లనివ్వకుండా అడ్డుపడేవాడు. దీంతో మా అమ్మమ్మ మానసికంగా బాగా కుంగిపోయింది. ఈ మధ్యనే పూర్ణ ఇంట్లో జరిగిన ఓ ఫంక్షన్‌కు స్వేచ్ఛను ఆహ్వానించకపోవడంపై తీవ్ర మనస్తాపానికి గురైంది. ఆ తర్వాతే ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువయ్యాయి. తల్లి ఈ సంబంధాన్ని ఇకపై కొనసాగించనని స్పష్టంగా చెప్పింది. మా అమ్మ ఆత్మహత్యకు బాధ, వేదన కలిగించిన వ్యక్తి పూర్ణ. అతడిని మా అమ్మ చెప్పుతో, నా చెప్పుతో కొట్టాలి. ఆ తర్వాతే అతడ్ని ఉరి తీయాలి అని స్వేచ్ఛ కుమార్తె డిమాండ్ చేసింది.

Read Also- Prada Sandals: కాపీ కొట్టిన డిజైన్‌తో చెప్పులు.. రేటు తెలిస్తే గుండె గుభేలుమంటుంది ?

Just In

01

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!