Swetcha: ప్రముఖ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ వొటార్కర్ (Swetcha Votarkar) ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఎందుకు.. ఎలా జరిగిందనే విషయాలపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు కానీ, ఆమెతో సహజీవనం చేస్తున్న పూర్ణచంద్రరావు (Purnachandra Rao) మాత్రం అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఫోన్ స్విచాఫ్ అని వస్తుండటం, అడ్రస్ లేకుండా పోవడంతో ఏదో తేడా కొడుతున్న పరిస్థితి. ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటూ.. ఇతరులకు స్ఫూర్తినిచ్చే స్వేచ్ఛ మరణాన్ని జీర్ణించుకోవడం కష్టమని అభిమానులు, మిత్రులు, కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఈ క్రమంలోనే స్వేచ్ఛ కుటుంబ సభ్యులు ‘స్వేచ్ఛ-బిగ్ టీవీ’తో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడి కొన్ని నిజానిజాలు వెల్లడించారు. స్వేచ్ఛ తండ్రి తన మనవరాలిని స్కూల్ నుంచి ఇంటికి తీసుకొనిరాగా, ఎంతసేపటికీ తలుపు తీయకపోవడంతో డోర్ పగలగొట్టగా సూసైడ్ చేసుకుందని గుర్తించారు. తన కుమార్తెతో స్వేచ్ఛ ఎప్పుడూ కొన్ని విషయాలు చెబుతుండేవారు. ఆ విషయాలను ఇప్పుడు ఎక్స్‌క్లూజివ్‌గా తెలుసుకుందాం..
Read Also- Crime Awareness: అవగాహన లేని అఘాయిత్యాలు ఆపలేమా?
బెస్ట్ మదర్..
‘ స్కూల్‌కు తాతయ్య వచ్చి ఇంటికి తీసుకొస్తాడమ్మా అని అమ్మ చెప్పింది. నన్ను స్ట్రాంగ్‌గా చేసి వెళ్లిపోయింది మా అమ్మ. మా అమ్మలేని లోటు ఎవరూ తీర్చలేరు. ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి.. అందర్నీ నమ్మొద్దని చెబుతుండేది. నేను ఉన్నంత వరకూ నేను నిన్న చూసుకుంటాను.. లైఫ్ లాంగ్ జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పింది. చిన్నప్పటి నుంచి మా అమ్మ కంటే చాలా ఇష్టం. షీ ఈజ్ బెస్ట్ అండ్ లవ్లీ మదర్ ఇన్ ది వరల్డ్. ఎలాంటి సమస్య ఉన్నా మా అమ్మ నాకు చెప్పేది.. నేను కూడా నా విషయాలు అమ్మతో చెప్పేదాన్ని.. పరిష్కరించేది. నేను ఉన్నాను కదా.. బాధపడొద్దని చెబుతుండేది. సడన్‌గా ఏమైందో తెలియదు కానీ.. స్కూల్ నుంచి డోర్ తీసేసరికి ఉరి వేసుకుని కనిపించింది. అమ్మను అలా చూసి షాకయ్యి.. పక్కకి వెళ్లిపోయాను. అమ్మను టచ్ చేసి చూశాను.. ముఖం చూసేసరికి భయమేసింది. అమ్మ ముఖం మొత్తం వైలెట్ కలర్‌లోకి వెళ్లిపోయింది. అరిచి బయటికొచ్చేశాను. రెండ్రోజుల క్రితమే అమ్మ టూర్‌కు వెళ్లి వచ్చింది. నాతో ఎలాంటి విషయాలు షేర్ చేసుకోలేదు. నిన్న ఉదయం స్కూల్‌కు వెళ్లేప్పుడు కూడా హగ్ (కౌగిలించుకోవడం) ఇచ్చి పంపింది. ప్రతిరోజూ నా హగ్ ఇస్తుండేది. మనం ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలని, అందరితో కలివిడిగా ఉండాలని చెబుతుండేది’ అని స్వేచ్ఛ కుమార్తె చెబుతూ కన్నీరుమున్నీరయ్యింది. తల్లి చివరి మాటలను.. ఎల్లప్పుడూ బలంగా ఉండాలని, అందరినీ నమ్మవద్దని ఆమె ఇచ్చిన సందేశాన్ని గుర్తుచేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యింది.
Read Also- Swecha Suicide: యాంకర్ స్వేచ్ఛ సూసైడ్.. తెరపైకి షాకింగ్ నిజాలు.. బాంబ్ పేల్చిన తండ్రి!
కర్త, ఖర్మ, క్రియ!
స్వేచ్ఛ తండ్రి శంకర్ మాత్రం తన కుమార్తె ఆత్మహత్యకు పూర్ణచంద్రరావు కారణమని చెబుతున్నారు. అతన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పూర్ణచంద్రరావు తన కుమార్తెకు చాలా బాధపెట్టాడని, అతడ్ని కలవొద్దని స్వేచ్ఛకు చాలాసార్లు సలహా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకొని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ నా కుమార్తె భర్తతో విడిపోయాక పూర్ణచంద్రరావుతో కలిసి ఉంటున్నది. స్వేచ్ఛను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి ఆమెతో సహజీవనం చేశాడు. జూన్ 26న నా కూతురు నుంచి ఫోన్ వచ్చింది. పూర్ణచంద్రరావుతో ఉండలేను నాన్న అని చెప్పింది. స్వేచ్ఛ పనిచేసిన న్యూస్ ఛానల్‌లోనే పూర్ణచంద్రరావు పనిచేశాడు. స్వేచ్ఛ-పూర్ణచంద్రరావుకు ఐదేళ్ల పరిచయం ఉంది. మూడేళ్ల పాటు ప్రేమ పేరుతో ఆయన వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని హామీ ఇవ్వడంతో స్వేచ్ఛ అతడ్ని అంగీకరించింది. అయితే పెళ్లి చేసుకోవాలని స్వేచ్ఛ కోరగా.. అతడు దాటవేస్తూ వచ్చాడు. పెళ్లిపై ఎంతగా ఒత్తిడి చేసినా కాలయాపన చేస్తూ వచ్చాడు. ఈ విషయంలోనే నా కూతురు మనస్థాపానికి గురై ప్రాణాలు తీసుకుంది. నా బిడ్డ మరణానికి కారణమైన పూర్ణచంద్రరావును కఠినంగా శిక్షించాలి’ అని స్వేచ్ఛ తండ్రి డిమాండ్ చేశారు.
Read Also- Viral Video: రోడ్డుపై నడుం లోతు నీళ్లు.. ఎంచక్కా స్కూటీపై వెళ్లిన వ్యక్తి.. వీడియో వైరల్!