Swecha Suicide (Image Source: Twitter)
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Swecha Suicide: యాంకర్ స్వేచ్ఛ సూసైడ్.. తెరపైకి షాకింగ్ నిజాలు.. బాంబ్ పేల్చిన తండ్రి!

Swecha Suicide: ప్రముఖ తెలుగు న్యూస్‌ ఛానల్‌లో పనిచేస్తున్న యాంకర్‌ స్వేచ్ఛ వోటార్కర్‌(40) శుక్రవారం బలవర్మణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. చిక్కడపల్లి ఠాణా పరిధి జవహర్‌నగర్‌లోని ఆమె నివాసంలో రాత్రి 10.30 గంటలకు ఆమె సూసైడ్ చేసుకున్నారు. ఫ్యానుకు లుంగీతో ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నారు. అయితే ఆమె సూసైడ్ కు కారణం ఏమై ఉంటుందని రాష్ట్రవ్యాప్తంగా తెగ చర్చజరుగుతోంది. ఈ క్రమంలో స్వేచ్ఛ తండ్రి సంచలన ఆరోపణలు చేశారు.

స్వేచ్ఛ తండ్రి ఏమన్నారంటే?
యాంకర్ స్వేచ్ఛ సూసైడ్ పై స్పందిస్తూ ఆమె తండ్రి శంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన కూతురు మరణానికి పూర్ణచంద్రరావు అనే వ్యక్తి కారణమని ఆయన ఆరోపించారు. భర్తతో విడిపోయాక పూర్ణచంద్రరావుతో స్వేచ్ఛ ఉంటున్నట్లు ఆమె తండ్రి తెలిపారు. స్వేచ్ఛను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి.. ఆమెతో సహజీవనం చేశాడని ఆయన చెప్పారు. అయితే జూన్ 26న తన కూతురు నుంచి ఫోన్ వచ్చిందని.. పూర్ణచంద్రరావుతో ఉండలేను నాన్న అని తనతో అన్నదని పేర్కొన్నారు.

కఠినంగా శిక్షించాలి
స్వేచ్ఛ పనిచేసిన న్యూస్ ఛానల్ లోనే పూర్ణచంద్రరావు పనిచేసినట్లు యాంకర్ తండ్రి తెలిపారు. వారికి ఐదేళ్ల పరిచయం ఉందని పేర్కొన్నారు. అయితే మూడేళ్ల పాటు ప్రేమ పేరుతో ఆయన వెంటపడ్డాడని చెప్పారు. పెళ్లి చేసుకుంటానని హామీ ఇవ్వడంతో స్వేచ్ఛ అతడ్ని అంగీకరించిందని ఆమె తండ్రి స్పష్టం చేశారు. అయితే పెళ్లి చేసుకోవాలని స్వేచ్ఛ కోరగా.. అతడు దాటవేస్తూ వచ్చాడని అన్నారు. పెళ్లిపై ఎంతగా ఒత్తిడి చేసినా కాలయాపన చేస్తూ వచ్చాడని చెప్పారు. ఈ విషయంలోనే తన కూతురు మనస్థాపానికి గురై ప్రాణాలు తీసుకుందని స్పష్టం చేశారు. తన కూతురు మరణానికి కారణమైన పూర్ణచంద్రరావును కఠినంగా శిక్షించాలని ఆమె తండ్రి డిమాండ్ చేశారు.

Also Read: Hanamkonda News: రాష్ట్రంలో ఘోరం.. మహిళను వివస్త్రను చేసి.. జననాంగంలో జీడిపోసి.. అతి దారుణం!

కేసీఆర్ సంతాపం
మరోవైపు స్వేచ్ఛ మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయంటూ ఆమె తల్లిదండ్రులు శంకర్, శ్రీదేవి పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతికి గల కారణాలను అన్వేషించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు మరికాసేపట్లో స్వేచ్ఛ మృతదేహానికి గాంధీ మార్చురీలో పోస్ట్ మార్టం జరగనుంది. ఇదిలా ఉంటే స్వేచ్ఛ మృతిపై మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సామాజిక స్పృహ వున్న కవయిత్రిగా, జర్నలిస్టు గా ఎదుగుతున్న స్వేచ్ఛ మరణం విషాదకరమన్నారు.

Also Read This: Telangana BJP President: తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరు? అమిత్ షా రాకతో క్లారిటీ వచ్చేనా?

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు