Hanamkonda News: హనుమ కొండలో అమానవీయ ఘటన జరిగింది. ఒక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న ఆరోపణలతో ఒక మహిళను వివస్త్రను చేసి విచక్షణా రహితంగా దాడి చేశారు. సదరు వ్యక్తి భార్య, ఆమె కుటుంబ సభ్యులు ఈ దారుణానికి ఒడిగట్టారు. ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే..
తాటికాయల గ్రామానిక చెందిన చిక్కుడు గంగకు ములుగు జిల్లాకు చెందిన చిక్కుడు రాజుతో వివాహమైంది. అయితే కొన్ని నెలలుగా రమ అనే మరో వివాహిత మహిళతో రాజు అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దీంతో భార్య గంగ ఈ విషయంపై భర్తతో తరుచూ గొడవపడేది. ఈ క్రమంలోనే పలుమార్లు పెద్ద మనుషులు దృష్టికి సైతం తీసుకెళ్లి హెచ్చరించింది. అయినప్పటికీ రాజు, రమ తమ వివాహేతర బంధాన్ని కొనసాగిస్తూ వచ్చినట్లు తెలుస్తోంది.
రక్తస్రావం అయ్యేలా..
భర్త రాజు ఎంత చెప్పినా వినకపోవడంతో ఆమె కోపం కట్టలు తెచ్చుకుంది. దీంతో గంగ తన కుటుంబ సభ్యులతో కలిసి భర్త అతని ప్రియురాలిపై ఒక్కసారిగా దాడికి తెగబడింది. ఈ క్రమంలో రమను వివస్త్రను చేయడమే కాకుండా ఆమె జననాంగంలో జీడిపోసి తీవ్ర రక్తస్తావం అయ్యేలా గంగ కుటుంబ సభ్యులు దాడి చేశారు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగుచేసింది.
Also Read: Pakistan Floods: ప్రాణాలు కాపాడలేరా.. కొంచెమైనా సిగ్గుండాలి.. పాక్‌పై ఆ దేశ పౌరులే ఫైర్!
పోలీసుల అదుపులో నిందితులు
ఈ దుర్మార్గమైన చర్య గురించి తెలుసుకున్న ధర్మసాగర్ పోలీసులు.. ఘటనపై సుమోటోగా తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడికి తెగబడ్డ చిక్కుడు గంగ, ఆమె కుటుంబ సభ్యులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు.