Thammudu: నితిన్ హీరోగా నటిస్తున్న సినిమా తమ్ముడు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా జూలై 4 రిలీజ్ కానుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ నిర్మాతులుగా వ్యవహరిస్తున్నారు. బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని అందించగా, కె.వి. గుహన్, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ గా పని చేశారు. హీరో నితిన్, సప్తమి గౌడ, లయ, వర్ష బొల్లమ్మ, స్వసిక విజయ్, సౌరభ్ సచ్‌దేవ, హరి తేజ, శ్రీకాంత్ అయ్యంగార్, టెంపర్ వంశీ, చమ్మక్ చంద్ర తదితర నటి నటులు నటించారు. పూర్తి యాక్షన్ డ్రామా, ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ తెరకెక్కింది. రూ. 75 కోట్లు బడ్జెట్ తో రూపొందించారు.
అయితే, ఈ సినిమాకి మొదటి నుంచి ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇక ఇప్పుడైతే ఎన్నడూ లేనిది వేణు శ్రీరామ్ కూడా ప్రమోషనల్ వీడియో చేశాడు. నలుగురు హీరోయిన్స్ డైరెక్టర్ ను చుట్టుముట్టి ప్రశ్నలు అడుగుతున్నారు. రౌండప్ చేసి కన్ఫ్యూజన్ చేయకండి. ఎందుకంటే కన్ఫ్యూజన్ లో ఎక్కువ మాట్లాడేస్తా. ట్రైలర్ వచ్చింది.. మొత్తం చూసేశాము? ఇంకా కొత్తగా ఏం ఉంది? చెప్తారా ? లేదా అని లయ అడిగింది. ఈయన చెప్పేలాగా లేడు.. రౌండప్ చేయండి. మాకే కాదు వాళ్ళకి కూడా చెప్పండని హీరోయిన్ అడగగా, అప్పుడు డైరెక్టర్ మీకు కాదు.. వాళ్ళకే చెబుతాను. సినిమా జూలై 4 రిలీజ్ కానుంది. దాని కంటే ముందు రిలీజ్ ట్రైలర్ రాబోతుందంటూ బిగ్ అనౌన్స్ మెంట్ చేశారు. దానిలో మీకున్న సందేహాలు క్లారిఫై అయిపోతాయని చెప్పాడు.
Something more Massive, Deadlier & Powerful..💥
Get ready for the #VibeOfThammudu – it's about to set everything on fire🔥🔥#Thammudu Release Trailer on June 30th❤️🔥#ThammuduOnJuly4th 🎯@actor_nithiin #SriramVenu #Laya @gowda_sapthami #SaurabhSachdeva @VarshaBollamma… pic.twitter.com/ezTdp0QSFd
— Sri Venkateswara Creations (@SVC_official) June 28, 2025