Kannappa Movie: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ సినిమా ఈ రోజు విడుదలైంది. మోహన్ బాబు నిర్మించిన ఈ భారీ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. గత పదేళ్లుగా విష్ణు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఈ ప్రాజెక్ట్ కోసం విష్ణు తన ప్రాణాన్ని ఫణంగా పెట్టారు. న్యూజిలాండ్‌లో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా తెరకెక్కించారు. ఇక వీఎఫ్ఎక్స్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా, కాస్త ఆలస్యమైనప్పటికీ, ఈ సినిమాను జూన్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
ప్రస్తుతం, సినిమా మిక్స్డ్ టాక్ తో దూసుకెళ్తుంది. ప్రెస్ రిలీజ్ నోట్ లో ఏం చెప్పారు? ఫస్ట్ హాఫ్ లో శివుడు గురించి ఏం చూపించారు? భక్త కన్నప్ప నీ డ్రీం ప్రాజెక్టు అయినప్పుడు నువ్వు మంచిగా తీసింది ఏది? ప్రభాస్ గారి పెద్ద నాన్న నుంచి నువ్వు రైట్స్ కొనుక్కున్నప్పుడు నువ్వు సినిమాకి న్యాయం చేశావు ? నేను మంచు విష్ణు మీద కేసు వేస్తా? సినిమా ట్రైలర్ అప్పుడు శివుడు గురించి అంతలా చూపించి, సినిమా రిలీజ్ అయ్యాక మొత్తం మార్చేశారు. ఇది ఫాల్స్ ఇన్ఫోర్మేషన్ కాదా అంటూ ఫ్యాన్స్ అందరూ ఫైర్ అవుతున్నారు.
కొందరు కన్నప్ప గురించి రివ్యూలు ఇచ్చారు. షోలు, ప్రివ్యూలు వేయడంతో విష్ణు మంచు చాాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడని అర్థం అవుతోంది. ఎంతో నమ్మకంగా ఉన్నానని విష్ణు మంచు చెప్పుకొచ్చారు. ఇక ఆ నమ్మకం నిజమైనట్టుగా ట్విట్టర్‌లో టాక్‌ను చూస్తే అర్థం అవుతోంది. ఫస్ట్ హాఫ్ మైనస్ అని, ఇంటర్వెల్ బ్లాక్ నుంచి సినిమా అదిరిపోయిందని రిపోర్టులు వస్తున్నాయి.
Also Read: Telangana: త్వరలో ఎంఈఎంయూ రైళ్లు అందుబాటులోకి వస్తాయి.. కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్
ఈ చిత్రానికి కొన్ని చోట్లా టాక్ బాగున్నా కూడా, మరి కొన్ని చోట్లా నెగిటివ్ గా వినిపిస్తోంది. ఇక కొందరైతే ప్రభాస్ కోసం సినిమాకి వచ్చామంటూ కామెంట్స్ చేస్తున్నారు. మంచు మనోజ్ కూడా సినిమా చూసి చాలా బాగుందని చెప్పారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.