Telangana: త్వరలో ఎంఈఎంయూ రైళ్లు అందుబాటులోకి వస్తాయి
Telangana ( Image Source: Twitter)
Telangana News

Telangana: త్వరలో ఎంఈఎంయూ రైళ్లు అందుబాటులోకి వస్తాయి.. కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్

Telangana: ప్రయాణికుల సౌకర్యం కోసం త్వరలో మైన్‌లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్(ఎంఈఎంయూ) రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. బుధవారం ఆయన్ను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణకు సంబంధించిన వివిధ రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై ఇద్దరూ చర్చించారు. 16 నుంచి 20 కోచ్‌లు ఉండే ఎంఈఎంయూ రైళ్లను తెలంగాణలోని కాజీపేట రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌లో ఉత్పత్తి చేయనున్నట్లు అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.

ఈ ఎంఈఎంయూ రైళ్లు, గ్రామీణ ప్రాంతాలు, సెమీ అర్బన్ ప్రాంతాలను అనుసంధానించడంలో, మరీ ముఖ్యంగా పండుగల సమయంలో ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటాయని స్పష్టం చేశారు. రూ.716 కోట్లతో కాజీపేటలోని రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణం పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, 2026 జనవరి నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు చెప్పారు. 2026 మే నుంచి ఉత్పత్తి ప్రారంభం కానున్నదని వివరించారు.

శుక్లాకు అభినందనలు

అంతరిక్ష ప్రయాణం చేస్తున్న భారతీయుడు శుభాన్షు శుక్లాకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అభినందనలు తెలిపారు. 41 ఏండ్ల క్రితం రాకేశ్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి అడుగుపెడుతున్న రెండో భారతీయుడిగా, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు వెళ్తున్న తొలి భారతీయుడిగా శుభాన్షు చేస్తున్న ప్రయాణం ప్రతి భారతీయుడికీ గర్వకారణమని కొనియాడారు. 14 రోజుల ప్రయాణం విజయవంతమై అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని ప్రార్థిస్తున్నట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

Just In

01

BiggBoss9 Prize Money: బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్‌కు వచ్చే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.. సర్‌ప్రైజ్ గెస్ట్ ఎవరంటే?

Kerala News: కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హవా.. పంచాయతీ ఎన్నికల్లో యూటీఎఫ్ సత్తా

Brown University: అమెరికాలో కాల్పులు.. ఇద్దరు మృతి, ఎనిమిది మంది పరిస్థితి విషమం

Etela Rajender: నేను ఏ పార్టీలో ఉన్నానో వారే చెప్పాలి: ఈటల రాజేందర్

Overdraft vs Personal Loan: ఓవర్‌డ్రాఫ్ట్ vs పర్సనల్ లోన్.. మీ డబ్బు అవసరంలో ఏది సరైన ఎంపిక?