Bank Holidays November 2025: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) విడుదల చేసిన అధికారిక సెలవు క్యాలెండర్ ప్రకారం 2025 నవంబర్ నెలలో దేశవ్యాప్తంగా బ్యాంకులు మొత్తం 11 రోజులు మూసివేయబడనున్నాయి. ఈ సెలవుల్లో వారాంతపు సెలవులు (శనివారాలు, ఆదివారాలు)తో పాటు రాష్ట్రాల వారీగా జరిగే ప్రత్యేక పండుగలు కూడా ఉన్నాయి. ఈ సెలవులు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులకు వర్తిస్తాయి. అయితే, రాష్ట్రానికి రాష్ట్రం ప్రకారం కొన్ని తేదీలు మారవచ్చు, ఎందుకంటే పండుగలు, ఆచారాలు ప్రాంతాలవారీగా వేరు వేరు ఉంటాయి.
నవంబర్ 1 (శనివారం)
ఈ నెలలో మొదటి బ్యాంకు సెలవు రోజు. ఈ రోజు కన్నడ రాష్ట్రోత్సవం (Kannada Rajyotsava) సందర్భంగా కర్ణాటకలో బ్యాంకులకు సెలవు. ఇక అదే రోజు ఉత్తరాఖండ్‌లోని బ్యాంకులు ఇగాస్-బగ్వాల్ పండుగ కారణంగా మూసివేయబడతాయి.
నవంబర్ 2 (ఆదివారం)
దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సాధారణ వారాంతపు సెలవు.
నవంబర్ 5 (బుధవారం)
గురు నానక్ జయంతి, కార్తీక పౌర్ణమి, రాస పౌర్ణమి పండుగల సందర్భంగా పంజాబ్, ఢిల్లీ, ఒడిశా, తూర్పు భారత రాష్ట్రాలలో బ్యాంకులు మూసివేయబడతాయి.
నవంబర్ 6 (గురువారం)
మేఘాలయాలోని షిల్లాంగ్ నగరంలో నాంగ్‌క్రెం డ్యాన్స్ ఫెస్టివల్ కారణంగా బ్యాంకులకు సెలవు.
Also Read: Refund Process: తప్పు అకౌంట్‌కి డబ్బు పంపించారా.. అయితే, ఆందోళన అవసరం లేదు.. ఇలా తిరిగి పొందొచ్చు!
నవంబర్ 7 (శుక్రవారం)
షిల్లాంగ్‌లో వాంగాలా ఫెస్టివల్ సందర్భంగా బ్యాంకులు మూసివేయబడతాయి. ఈ పండుగ గారో తెగకు చెందిన పంట కోత ఉత్సవం.
నవంబర్ 8 (శనివారం)
నెలలో రెండో శనివారం కావడంతో అన్ని బ్యాంకులకు నియమిత సెలవు. అదే రోజు బెంగళూరులో కనకదాస జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయబడతాయి.
నవంబర్ 9 (ఆదివారం)
సాధారణ వారాంతపు సెలవు.
నెల ద్వితీయార్థంలో కూడా మరికొన్ని వారాంతపు సెలవులు ఉన్నాయి..
నవంబర్ 16 (ఆదివారం), నవంబర్ 22 (నాలుగవ శనివారం), నవంబర్ 23 (ఆదివారం), నవంబర్ 30 (ఆదివారం).
రెండవ, నాలుగవ శనివారాలు RBI మార్గదర్శకాల ప్రకారం అన్ని బ్యాంకులకు సాధారణ సెలవులుగా పరిగణించబడతాయి. మొత్తం మీద, నవంబర్ 2025లో దేశవ్యాప్తంగా బ్యాంకులు 11 రోజులు మూసివేయబడతాయి. నవంబర్ నెల బ్యాంకు ఉద్యోగులకు, ప్రజలకు పండుగలతో నిండిన నెలగా ఉండనుంది. అయితే, కస్టమర్లు ఈ సమయంలో డిజిటల్ బ్యాంకింగ్ సేవలను ఉపయోగించవచ్చు. అయితే, తమ ఆఫ్‌లైన్ లావాదేవీలను ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది.
